తన పొలిటికల్ ఎంట్రీపై జ్యోతిక సంచలన నిర్ణయం..

తన పొలిటికల్ ఎంట్రీపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో ఆమె భర్త  సూర్య నిర్మించిన పోన్ మగల్ వందల్‌ సినిమా ఈ పాటికే విడుదల కావాల్సి ఉంది. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది.

news18-telugu
Updated: May 25, 2020, 9:37 AM IST
తన పొలిటికల్ ఎంట్రీపై జ్యోతిక సంచలన నిర్ణయం..
రాక్షసి మూవీలో జ్యోతిక (File /Photo)
  • Share this:
తన పొలిటికల్ ఎంట్రీపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో ఆమె భర్త  సూర్య నిర్మించిన పోన్ మగల్ వందల్‌ సినిమా ఈ పాటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా విడుదల కాలేదు. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం తీసుకున్న అప్పులను తీర్చడానికి సూర్య ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ ప్లాట్‌పామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయడానికి అంతా సిద్దం చేసుకున్నాడు. తమిళంలో తొలిసారి థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల కాబోతున్న తొలి తమిళ మూవీగా ‘పొన్ మగల్ వందల్’ రికార్డులకు ఎక్కింది. ఈ నిర్ణయం తమిళనాడు థియేటర్‌ యజమానులకు అస్సలు నచ్చలేదు. వాళ్లు సూర్య నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ సినిమా అయినా కూడా ముందు థియేటర్‌లో విడుదలైన తర్వాత ఓటిటిలో రావాలి.. కానీ ఇప్పుడు సూర్య మాత్రం తాను నిర్మించిన పోన్ మగల్ వందల్‌ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నారు. దీంతో తమిళనాడులోని థియేటర్స్ మరియు మల్టీప్లెక్స్ యజమానులు ఇకపై సూర్య బ్యానర్‌పై నిర్మించే సినిమాలను థియేటర్‌లో ప్రదర్శించకూడదనే  నిర్ణయానికి వచ్చారు. ఐనా సూర్య వెనకడుగు వేయలేదు. ఈ సినిమా ఈ నెల 27న స్ట్రీమింగ్ కానుంది.పోన్ మగల్ వందల్‌ సినిమాలో లాయర్ పాత్రలో నటించింది జ్యోతిక. ఈ సినిమాను జేజే ఫ్రెడ్రిక్‌ తెరకెక్కించాడు.

జ్యోతిక కొత్త చిత్రం (ponmagal vandhal)
జ్యోతిక కొత్త చిత్రం (ponmagal vandhal)


ఈ సందర్భంగా జ్యోతిక తమిళనాడులో పాత్రికేయులతో జూమ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ విలేకరి మాట్లాడుతూ.. సూర్య తండ్రి శివకుమార్ ఫ్యామిలీ గత కొన్నేళ్లుగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. ఆ కుటుంబం నుంచి మీరు రాజకీయాల్లో వచ్చి చెన్నైలోని టీ నగర్ నుంచి పోటీ చేయవచ్చు కదా అని ఓ విలేఖరి జ్యోతికను ప్రశ్నించాడు. దీనికి జ్యోతిక సమాధానమిస్తూ.. ప్రజలకు సేవ చేయడానికి పాలిటిక్స్‌లోకి రావాల్సి అవసరం లేదంటూనే తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని సమాధానమిచ్చింది.  ఈ సందర్భంగా  ప్రతి ఒక్కరు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇల్లు శుభ్రంగా ఉంటే పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. అలా దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుందని సమాధానమిచ్చింది. మొత్తంగా తన పొలిటికల్ ఎంట్రీపై జ్యోతిక ఆసక్తికర సమాధామనే ఇచ్చింది.

 
First published: May 25, 2020, 9:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading