Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి తనయ సినిమాల్లోనూ దూసుకుపోతున్నారు. దఢక్ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యటీ.. ఇప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు ఆమె నటించిన రూహీ మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ సింపుల్‌గా ఉండేందుకు జాన్వీ ఇష్టపడుతుంటుంది. సినిమాల్లో పక్కనపెడితే బయట మాత్రం సింపుల్‌గా ఉంటుంది ఈ నటి. ఇటీవల తన పెళ్లి గురించి మాట్లాడిన జాన్వీ.. తనకు గ్రాండ్ పెళ్లి అంటే ఇష్టం లేదని. చాలా సింపుల్‌గా తిరుపతిలో చేసుకోవాలని ఉందని చెప్పింది. కాగా ఫ్యాన్స్ విషయంలోనూ జాన్వీ, తన తల్లి బాటలో పయనిస్తోంది. తన తల్లి అభిమానులను ఎలా ట్రీట్ చేసేదో.. ఇప్పుడు జాన్వీ కూడా అలానే చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల జాన్వీ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగెట్టారు. ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు. వారందరికీ ఓపికతో సెల్ఫీలు ఇచ్చుకుంటూ ముందుకు వెళుతోంది జాన్వీ. అయితే ఆమె ముందుకు వెళ్లే సమయంలో ఒక అభిమాని సెల్ఫీ కోసం ఆమె దగ్గరకు రాగా.. జాన్వీ బాడీగార్డ్ అతడిపై కాస్త కఠువుగా ప్రవర్తించాడు. చేయిని బలవంతంగా తీసేశాడు. అది గమనించిన జాన్వీ.. వెంటనే అలర్ట్ అయ్యింది. బాడీగార్డ్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.
View this post on Instagram
అభిమాని దగ్గరకు వెళ్లి మాట్లాడుతూ.. సెల్ఫీ తీసుకోమని చెప్పింది. దీంతో ఆ అభిమాని సంతోషంగా సెల్ఫీ తీసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తోన్న పలువురు నెటిజన్లు జాన్వీ తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Janhvi Kapoor