Actress Indraja: తెలుగు సిని అలనాటి నటి ఇంద్రజ గురించి అందరికీ తెలిసిందే. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ప్రస్తుతం సహాయనటిగా నటిస్తుంది. ఇదిలా ఉంటే బుల్లితెరలో కూడా కామెడీ షో లో ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో కి రోజా ప్లేస్ లో జడ్జిగా తెగ అదరగొడుతుంది. రోజా అనారోగ్యం వల్ల ఇంద్రజ పాల్గొంటుంది. అంతేకాకుండా బుల్లితెర లో మరో రియాలిటీ షో లో కూడా పాల్గొననుంది.
స్టార్ మా లో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే. ఇక త్వరలో మరో సీజన్ రానున్న సందర్భంగా ప్రస్తుతం అందులో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి అనౌన్స్ జరుగుతుంది. ఇక ఈ షోలో ఇంద్రజ కు ఆఫర్ రాగా.. కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. తను పనిలో కంఫర్టబుల్ గా ఫీల్ అయితేనే చేస్తాదట లేదంటే చేయానని చెప్పేస్తేదట. బిగ్ బాస్ విషయానికి వస్తే గత సీజన్లోనే ఆఫర్ వచ్చిందని కానీ తను రాలేనని చెప్పేసిందట.
ఆ సమయంలో తనకు సీరియల్స్ ఆఫర్స్ వస్తున్నాయని, చేయకపోవడానికి కారణం చెన్నై లో అన్ని వదిలేసి వచ్చి ఇక్కడ ఉండలేక, ఫ్యామిలీ కి దూరంగా ఉండలేనని, అందుకే బిగ్ బాస్ కి రాలేనని చెప్పిందట. పాల్గొన్న కంటెస్టెంట్ లో బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులు ఉంటారో తెలియదు కానీ, ఒకవేళ ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే తను ఉండలేను అంటూ అందుకే బిగ్ బాస్ కి వెళ్లలేదని తెలిపింది.
ఫ్యూచర్ లో కూడా అవకాశం వస్తే వెళ్ళనంటూ, ఎందుకంటే ఫ్యామిలీకి దూరంగా ఉండలేదట. గెస్ట్ గా అయితే చూస్తా కానీ హౌసింగ్ అయితే తనకు అంత సీన్ లేదని అక్కడ ఉన్నది నాగార్జున కాబట్టి తనతో పోటీపడలేనని తెలిపింది. గెస్ట్ గా రమ్మంటే వాళ్లు ఇచ్చే డబ్బుల కోసం కాకుండా నాగార్జున కోసం వెళ్తుందట. నాగార్జున హోస్టింగ్ చాలా బాగుంటుందని, స్టైలిష్ విషయంలో ఇప్పటికీ ఎంతో అందంగా ఉంటారని, ఆయనంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. తన ఫస్ట్ టైం సాంగ్ నాగార్జున తోనే చేసిందంటూ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actress Indraja, Akkineni nagarjuna, Bigg boss season 4, Jabardasth, Tollywood, Tv comedy show