Home /News /movies /

ACTRESS HIMAJAS RESPONSE ON THE NEWS OF MARRIAGE AND DIVORCE IT IS CLEAR THAT SHE WILL GET MARRIED IN FOUR YEARS SNR

నాకు పెళ్లి సెట్ అవదు.. మంచి సంబంధం చూడమన్న టాలీవుడ్ నటి

Photo Credit:Instagram

Photo Credit:Instagram

Video Viral: సినీ నటి హిమజ ఫైర్ అయింది. తన పెళ్లి, విడాకుల వార్తలను ఖండించిన బిగ్‌బాస్‌ ఫేమ్..పెళ్లికి తనకు సెట్ అవదని..చేసుకోవాల్సి వస్తే చాలా గ్రాండ్‌గా చేసుకుంటానని ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసింది.

సినీ నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ హిమజ(Himajas)కు కోపం వచ్చింది. సోషల్ మీడియా(Social media)లో తన పెళ్లి, విడాకుల అంశంపై నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తుంటే తట్టుకోలేకపోయింది. ఏదైతే అది అయిందనుకొని డైరెక్ట్‌గా ఇన్‌స్టాలో పెళ్లి, విడాకుల(Marriage), (Divorce)పై క్లారిటీ ఇస్తూ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram)పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో తన పెళ్లి జరిగినట్లు విడాకులు కూడా తీసుకుంటున్నట్లుగా చక్కర్లు కొడుతున్న వార్తలను ఖండించింది. తాను షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఇలాంటి వదంతుల్ని పట్టించుకోలేదని కాని తన సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్నట్లు చెప్పింది హిమజ. ఇలాంటి పుకార్లు, రూమర్లు తాను పెద్దగా పట్టించుకోనని చెబుతూనే తన పెళ్లి వార్తపై క్లారిటీ ఇచ్చింది. తనకు పెళ్లి సెట్‌ కాదన్నారు సినీ నటి. పెళ్లికి మరో నాలుగైదేళ్లు (Four- five year)టైముందన్న హిమజ..చేసుకుంటే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటామని ఇన్‌స్టాలో వీడియో (Video message)షేర్ చేశారు. అంతే కాదు ఎవైనా మంచి సంబంధాలు ఉంటే కాస్త చెప్పమంటూ తనపై రూమర్లు సృష్టిస్తున్న వారిపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్ వేసింది.

పెళ్లి లేదు..విడాకులు లేదు..
తన పెళ్లి, విడాకులు వ్యవహారంలో తాను లేకుండానే ఎవరు పడితే వాళ్లు ఆన్‌లైన్‌లోనే ఇచ్చుకుంటున్నారని చెప్పింది. ఇలాంటి వార్తలపై తాను పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్న హిమజ..ఇంట్లో ఉండే తల్లిదండ్రులు సున్నితంగా ఉంటారని వాళ్ల మనసు బాధపడుతుంది కాబట్టి దయచేసి అలాంటి వదంతులు ఆపమని సోషల్ మీడియా ద్వారా కోరింది.








View this post on Instagram






A post shared by Himaja💫 (@itshimaja)






అంతా అబద్దం నా మాట నమ్మండి..
ఈ విషయంలో ఇప్పటికే తాను సైబర్ క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్ చేశానన్నారు హిమజ. తాను కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ తనను అగౌరవపరచాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.

దానికి ఇంకా టైముంది..
తనను అభిమనించే వాళ్లు, తనకు సపోర్ట్‌గా ఉండే వాళ్లకు థాంక్స్ చెప్పారు హిమజ. తనపై తన పెళ్లి, విడాకుల వ్యవహారంపై ఇంకా ఏదైనా ఛానళ్లలో పుకారు వార్తలు వస్తే వారిపై కూడా ఫిర్యాదు చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉండే వాళ్లపై రూమర్లు, పుకార్లు షికార్లు చేయడం కామన్‌.  హిమజ షేర్ చేసిన వీడియో తర్వాత అయినా వాటికి  చెక్‌ పడుతుందో లేదో చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: Actress, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు