• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACTRESS HIMAJA BOLD STATEMENTS ON EXPOSING IN BIGG BOSS 4 TELUGU SHOW PK

Bigg Boss Himaja: చూపిస్తే తప్పేంటి.. బిగ్ బాస్‌లో ఎక్స్‌పోజింగ్‌పై హిమజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Bigg Boss Himaja: చూపిస్తే తప్పేంటి.. బిగ్ బాస్‌లో ఎక్స్‌పోజింగ్‌పై హిమజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

బిగ్ బాస్ 4 తెలుగులో హాట్ షో (exposing bigg boss 4)

Bigg Boss Himaja: బిగ్ బాస్ హౌజ్‌లో అమ్మాయిలు ఈ సారి కాస్త ఎక్కువగానే ఉన్నారు. అందులో లాస్య తప్పిస్తే మిగిలిన వాళ్లంతా ఎక్స్‌పోజింగ్ చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయరు. అలాంటి వాళ్లనే ఎంపిక చేసారు. దానికి తగ్గట్లుగానే..

  • Share this:
బిగ్ బాస్ హౌజ్‌లో అమ్మాయిలు ఈ సారి కాస్త ఎక్కువగానే ఉన్నారు. అందులో లాస్య తప్పిస్తే మిగిలిన వాళ్లంతా ఎక్స్‌పోజింగ్ చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయరు. అలాంటి వాళ్లనే ఎంపిక చేసారు. దానికి తగ్గట్లుగానే మొదట్నుంచి కూడా మోనాల్, హారిక, అరియానా, దివి లాంటి అమ్మాయిలు గ్లామర్ షోతో చంపేసారు. ముఖ్యంగా ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా దివి తన నడుము ఒంపులతో చాలా మందికి నిద్ర లేకుండా చేసింది. ఇప్పుడు ఇంట్లో కూడా అరియానా, హారిక, మోనాల్ ఫుల్ గ్లామర్ షో చేస్తున్నారు. ఒక్కోసారి గ్లామర్ షో హద్దులు కూడా దాటేస్తుందంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఫ్యామిలీ షో అంటూ మరీ ఇంతగా దిగజారిపోవాలా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. దానికితోడు టాస్కుల్లో కూడా అమ్మాయిలు మరీ రెచ్చిపోతున్నారు. పైగా బిగ్ బాస్ ఇంట్లో ఆడ, మగ అనే బేధాలు లేవంటూ మళ్లీ మళ్లీ చెప్తున్నాడు నాగార్జున. దాంతో మరింత రెచ్చిపోతున్నారు ఇంటి సభ్యులు.

himaja twitter,himaja instagram,himaja after bigg boss,bigg boss himaja,himaja controversial comments on bigg boss,himaja shocking comments on sreemukhi,bigg boss contastant himaja shocking comments on nagarjuna,himaja exposing,himaja bigg boss exposing,బిగ్ బాస్ హిమజ,హిమజ ఎక్స్‌పోజింగ్,తెలుగు సినిమా
దేత్తడి హారిక (dethadi harika)


అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో అమ్మాయిల ఎక్స్‌పోజింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది హిమజ. ఈమె గత సీజన్‌లో ఆడింది. దాదాపు సగం సీజన్ ఉండి బయటికి వచ్చింది హిమజ. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ ఇంట్లో ఎలా ఉండాలి.. ఎలాంటి పద్దతులు ఉంటాయి అనే విషయంపై మాట్లాడింది. అక్కడ ఎవరూ ఈ డ్రెస్ వేసుకోండి అంటూ అమ్మాయిలను అడగరని.. వాళ్లెవరూ చెప్పరని చెప్పుకొచ్చింది హిమజ. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని.. ఎవరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటారని.. ఎక్స్‌పోజింగ్ చేయడం అనేది పూర్తిగా వాళ్ల ఛాయిస్ అంటూ క్లారిటీ ఇచ్చింది హిమజ.

himaja twitter,himaja instagram,himaja after bigg boss,bigg boss himaja,himaja controversial comments on bigg boss,himaja shocking comments on sreemukhi,bigg boss contastant himaja shocking comments on nagarjuna,himaja exposing,himaja bigg boss exposing,బిగ్ బాస్ హిమజ,హిమజ ఎక్స్‌పోజింగ్,తెలుగు సినిమా
హిమజ (Himaja)


ప్రస్తుతం ఇంట్లో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు.. వాళ్లు షో చేస్తున్నారంటే అది పూర్తిగా వాళ్ల ఛాయిస్ అంటుంది ఈ భామ. అక్కడ ఎక్కువ చూపిస్తే ఎక్కువ డబ్బులెక్కువిస్తారు అనేది కేవలం ఊహాగానమే అంటుంది హిమజ. వాళ్లు ఎక్కువగా హైలైట్ కావడం కోసమే గ్లామర్ షో చేస్తుంటారని.. దీనికి నిర్వాహకులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. అయినా ఉన్నపుడు చూపిస్తే తప్పేంటి అంటూ సంచలనం రేపుతుంది హిమజ.

 himaja twitter,himaja instagram,himaja after bigg boss,bigg boss himaja,himaja controversial comments on bigg boss,himaja shocking comments on sreemukhi,bigg boss contastant himaja shocking comments on nagarjuna,himaja exposing,himaja bigg boss exposing,బిగ్ బాస్ హిమజ,హిమజ ఎక్స్‌పోజింగ్,తెలుగు సినిమా
బిగ్ బాస్ బ్యూటీస్ (Bigg Boss 4 Telugu)


కండలు పెంచుకునేది చూపించుకోడానికి కానీ దాచుకోడానికి కాదు కదా అంటూ చెప్పింది. అమ్మాయిలు కూడా అంతే.. వాళ్లు చూపించాలనుకుంటున్నారు చూపిస్తున్నారు అందులో తప్పేముంది అంటుంది హిమజ. మొత్తానికి ఈమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు