కోరిక తీరిస్తే అవకాశం.. ప్రముఖ దర్శకుడిపై హీరోయిన్ కేసు..

ప్రతీతాత్మక చిత్రం

Casting Couch: ఈ రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎప్పుడు ఏ హీరోయిన్ బయటికి వచ్చి తనను పలానా దర్శకుడు వేధించాడని చెబుతుందో అర్థం కావడం లేదు.

  • Share this:
ఈ రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎప్పుడు ఏ హీరోయిన్ బయటికి వచ్చి తనను పలానా దర్శకుడు వేధించాడని చెబుతుందో అర్థం కావడం లేదు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాలా మంది హీరోయిన్లు ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఓ హీరోయిన్ ఇదే చేసింది. ప్రముఖ మలయాళ దర్శకుడు, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ చైర్మన్ కమల్ తనను లైంగికంగా వేధించాడని ఓ మలయాళ నటి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారుతుంది.
మలయాళం దర్శకుడు కమల్ (malayalam director kamal)
మలయాళం దర్శకుడు కమల్ (malayalam director kamal)

తనకు ప్రణయ మీనుకలుడే కాదల్ సినిమాలో అవకాశం ఇస్తానని.. దానికి ప్రతిఫలంగా కోరిక తీర్చమన్నాడని ఫిర్యాదులో ఆ నటి తెలిపింది. ఇప్పుడు ఇది మలయాళ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతుంది. రెండేళ్ల కింద సీనియర్ నటి మంజూ వారియర్ ప్రధాన పాత్రలో కమల్ తెరకెక్కించిన ఆమి షూటింగ్ సమయంలో ఇదంతా జరిగిందని ఈ నటి తన ఫిర్యాదులో పేర్కొంది.
మలయాళం దర్శకుడు కమల్ (malayalam director kamal)
మలయాళం దర్శకుడు కమల్ (malayalam director kamal)

ఆ చిత్ర షూటింగ్ సమయంలో కమల్ తనను లైంగికంగా వేధించాడని.. తన ఫ్లాట్ కు తీసుకెళ్లి దారుణంగా ప్రవర్తించాడని.. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది ఈమె. లైంగిక వేధింపులపై 2019 ఏప్రిల్ 26న దర్శకుడికి లీగల్ నోటీసులు పంపినట్టు ఆమె తెలిపింది. ఈ ఫిర్యాదుపై కమల్ కూడా స్పందించాడు. కేవలం తన ప్రతిష్టను దిగజార్చడానికే ఆమె అలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తుందని.. అవన్నీ నిరాధారమైనవని ఫైర్ అయ్యాడు కమల్. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని మలయాళ సినీ పెద్దలు కూడా సీరియస్‌గా తీసుకున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: