హోమ్ /వార్తలు /సినిమా /

Deepika Singh : నువ్వు నీ పైత్యం.. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తోంటే.. డ్యాన్స్ చేయాలా..

Deepika Singh : నువ్వు నీ పైత్యం.. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తోంటే.. డ్యాన్స్ చేయాలా..

దీపికా సింగ్ (Photo Credit : Instagram)

దీపికా సింగ్ (Photo Credit : Instagram)

Deepika Singh : సాధారణంగా భారీ వర్షం వస్తే గుండె ఝల్లుమంటుంది, అడుగు బయట పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఏకంగా తుపాను ప్రభావంతో కుంభవృష్టి కురిస్తే ఇంకేమైనా ఉందా? ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది.

ఇంకా చదవండి ...

తౌటే తుఫాన్ కొన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ప్రధానంగా కేరళ రాష్ట్రం విలవిలలాడుతోంది. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. దేశ వాణిజ్య రాజధాని పేరొందిన ముంబైపై కూడా తుఫాన్ ఎఫెక్ట్ భారీగానే పడింది. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద భారీగానే నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో వేర్లతో సహా చెట్లు నేలకూలాయి. సాధారణంగా భారీ వర్షం వస్తే గుండె ఝల్లుమంటుంది, అడుగు బయట పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఏకంగా తుపాను ప్రభావంతో కుంభవృష్టి కురిస్తే ఇంకేమైనా ఉందా? ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సమయంలో దియా ఔర్‌ బాతీ హమ్‌(ఈ తరం ఇల్లాలు) సీరియల్‌ ఫేమ్ దీపికా సింగ్‌ చేసిన పనికి అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కారణం ఆమె రోడ్డు మీద విరిగిపడిన చెట్ల దగ్గరికు వెళ్లి ఫొటోషూట్‌ చేయడమే. "తుపానును మీరు ఆపలేరు, కాబట్టి దాన్ని ఆపాలన్న ప్రయత్నం చేయకండి. అలా అని సైలెంట్‌గా కూర్చోకుండా ప్రకృతిని ఆలింగనం చేసుకోండి.. ఈలోగా తపాను వచ్చినదారినే వెళ్లిపోతుంది", "మా ఇంటి పక్కన ఓ చెట్టు విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు, కానీ దాన్ని అక్కడ నుంచి తొలగించే క్రమంలో ఈ టౌటే తుపానును గుర్తుంచుకునేందుకు నా భర్త రోహిత్‌, నేను కొన్ని ఫొటోలు తీసుకున్నాం" అని తాను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటోలకు క్యాప్షన్‌ కూడా ఇచ్చింది.

మరోవైపు, దీనికి తోడు వర్షంలో డ్యాన్స్‌ చేసిన వీడియోను సైతం అభిమానులతో పంచుకుంది. ఇది చూసి నోరెళ్లబెట్టిన జనాలు "ఫొటోషూట్లు, డ్యాన్సులు చేయడానికి సమయం, సందర్భం అక్కర్లేదా?" అని తిట్టిపోస్తున్నారు. "ఓ పక్క తుపాను వల్ల జనాలు ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు దాన్ని ఎంజాయ్‌ చేస్తున్నావా? ఛీ, సిగ్గుచేటుగా ఉంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. "బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు, కాబట్టి ఈ సమయంలో ఇలాంటి పిచ్చి పనులు చేయకపోతేనే మంచిది" అని సూచిస్తున్నారు.
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే..వానలో డ్యాన్స్ లు చేయమంటావా అని ఆమెను తిట్టిపోస్తున్నారు.సోషల్ మీడియాలో వ్యక్తమౌతోన్న విమర్శలకు ఆమె సమాధానం ఇచ్చారు. తన ఇంటి ఎదురుగా నేలకూలిన చెట్ల వద్దే తాను ఫొటోషూట్ చేశానని దీపికా సింగ్ వివరణ ఇచ్చారు.

First published:

Tags: Bollywood news, Cyclone, Deepika singh, Mumbai

ఉత్తమ కథలు