నటనకు గుడ్ బై చెప్పిన ఛార్మి.. ఇకపై పూర్తిగా దానికే అంకితం..

Charmi Kaur: 13 ఏళ్ల వయసులోనే నీ తోడు కావాలి అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఛార్మి. ఆ తర్వాత హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా ఒకానొక సమయంలో తెలుగులో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 18, 2020, 6:22 PM IST
నటనకు గుడ్ బై చెప్పిన ఛార్మి.. ఇకపై పూర్తిగా దానికే అంకితం..
ఛార్మి కౌర్ (Instagram/ Charmme Kaur)
  • Share this:
13 ఏళ్ల వయసులోనే నీ తోడు కావాలి అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఛార్మి. ఆ తర్వాత హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా ఒకానొక సమయంలో తెలుగులో సెకండ్ హీరోయిన్ అంటే ఛార్మి తప్ప మరో ఆప్షన్ లేదు. స్టార్ హీరోలందరితోనూ నటించింది ఈ బ్యూటీ. కెరీర్‌లో దాదాపు 50 సినిమాలు పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ వయసు ఉన్నా కూడా నటన మాత్రం ఆపేసింది ఛార్మి. ప్రస్తుతం నిర్మాతగా కెరీర్ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది ఈ భామ. ఇకపై తాను నటించను అంటూ ప్రకటించింది ఛార్మి.
ఛార్మి కౌర్ (Instagram/ Charmme Kaur)
ఛార్మి కౌర్ (Instagram/ Charmme Kaur)


గతేడాది పూరీ జగన్నాథ్‌తో కలిసి నిర్మాతగా మారి ఇస్మార్ట్ శంకర్ సినిమాను నిర్మించింది ఛార్మి. ఇప్పుడు ఆకాశ్ పూరి రొమాంటిక్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాను కూడా నిర్మిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇకపై సినిమాల్లో నటించనంటూ చెప్పేసింది.
ఛార్మి కౌర్ (Instagram/ Charmme Kaur)
ఛార్మి కౌర్ (Instagram/ Charmme Kaur)

ప్రస్తుతం ఇండస్ట్రీకి చాలా మంది కొత్త హీరోయిన్స్ వస్తున్నారని.. వాళ్లంతా అద్భుతమైన ప్రతిభను చూపిస్తున్నారంటుంది ఛార్మి. ఇలాంటి సమయంలో తాను నటిగా ఉండాలనుకోవడం లేదని.. నిజానికి ఐదేళ్ల కింద జ్యోతిలక్ష్మీ సమయంలోనే నటిగా రిటైర్‌మెంట్ ప్రకటిద్దామని అనుకుంటే.. పూరి జగన్నాథ్, సి కళ్యాణ్ సలహా మేరకు అప్పుడు ప్రకటించలేదని చెప్పుకొచ్చింది ఛార్మి. మొత్తానికి ఇన్నేళ్ల యాక్టింగ్ కెరీర్‌కు ఫ్లాప్‌తోనే ఫుల్ స్టాప్ పెట్టింది ఛార్మి.
Published by: Praveen Kumar Vadla
First published: May 18, 2020, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading