హోమ్ /వార్తలు /సినిమా /

Chandini Chowdary: స్టేజ్ మీదే ఏడ్చేసిన క‌లర్ ఫొటో న‌టి చాందినీ చౌద‌రీ

Chandini Chowdary: స్టేజ్ మీదే ఏడ్చేసిన క‌లర్ ఫొటో న‌టి చాందినీ చౌద‌రీ

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ తెలుగు హీరోయిన్ల‌లో చాందిని చౌద‌రీ ఒక‌రు. షార్ట్ ఫిలింస్ ద్వారా కెరీర్‌ని ప్రారంభించిన చాందినీ చౌద‌రీ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ ద్వారా వెండితెర‌పైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్ర‌మంలో మొద‌ట్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించిన ఈ నటి.. ఇప్పుడు మాత్రం ఫుల్ టైమ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక గ‌తేడాది విడుద‌లైన క‌ల‌ర్ ఫొటోలో చాందినీ న‌టన‌కు మంచి మార్కులు ప‌డ్డాయి

ఇంకా చదవండి ...

  Chandini Chowdary: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ తెలుగు హీరోయిన్ల‌లో చాందిని చౌద‌రీ ఒక‌రు. షార్ట్ ఫిలింస్ ద్వారా కెరీర్‌ని ప్రారంభించిన చాందినీ చౌద‌రీ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ ద్వారా వెండితెర‌పైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్ర‌మంలో మొద‌ట్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించిన ఈ నటి.. ఇప్పుడు మాత్రం ఫుల్ టైమ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక గ‌తేడాది విడుద‌లైన క‌ల‌ర్ ఫొటోలో చాందినీ న‌టన‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇప్పుడు ఈ బ్యూటీ సూప‌ర్ ఓవ‌ర్ అనే చిత్రంలో న‌టించింది. ఇందులో న‌వీన్ చంద్ర హీరోగా న‌టించ‌గా.. ఈ సినిమా ఈ నెల 22న‌ ఓటీటీలో విడుద‌ల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఇటీవ‌ల ఈ మూవీ నుంచి వ‌చ్చిన టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. కాగా ఈ మూవీ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన చాందినీ చౌద‌రీ భావోద్వేగానికి గురి స్టేజ్ మీదే ఏడ్చేశారు.

  ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌లో ఉండ‌గా.. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ యాక్సిడెంట్‌కి గురి అయ్యి క‌న్నుమూశారు. దాన్ని గుర్తు చేసుకున్న చాందినీ.. స్టేజ్ మీద ఎమోష‌న‌ల్ అయ్యారు. క్రికెట్ బెట్టింగ్ మీద ప్ర‌వీణ్ ఈ చిత్రాన్ని బాగా తీశాడు. ఇది మీకు క‌చ్చితంగా న‌చ్చుతుంది అనుకుంటున్నాము. ఈ మూవీ ప్ర‌వీణ్‌కి అంకితం అని చాందినీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర ఆమెను ఓదార్చారు.

  ఇక న‌వీన్ చంద్ర మాట్లాడుతూ.. మేము ఇంత ఎమోష‌న‌ల్ అవ్వ‌డానికి కార‌ణం. సినిమా కంటే ఆ మ‌నిషితో గ‌డిపిన నెల రోజులు. అది మ‌రిచిపోలేము. ప్ర‌వీణ్ మ‌మ్మ‌ల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇండ‌స్ట్రీలో ప్ర‌వీణ్ గురించి అంద‌రికీ మంచి ఇంప్రెష‌న్ ఉంది. ప్ర‌వీణ్ చ‌నిపోయిన త‌రువాత ఈ సినిమాను అంద‌రి ముందుకు తీసుకొచ్చేందుకు సుధీర్ చేసిన ప్ర‌య‌త్నానికి హ్యాట్సాఫ్. అత‌డి గురించి మాకే ఎలానో ఉంది. వాళ్లింట్లో వాళ్లకు దేవుడు బ‌లం ఇవ్వాలి అని ఎమోష‌న‌ల్ అయ్యాడు.

  కాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ వ‌ద్ద అసిస్టెంట్‌గా ప‌నిచేసిన ప్ర‌వీణ్.. ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లాక్‌డౌన్ త‌రువాత ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించిన ప్ర‌వీణ్.. క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో సీన్‌ని వివ‌రిస్తూ ఓ యాక్సిడెంట్‌కి గుర‌య్యాడు. ఆ త‌రువాత వారం రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందిన ఈ ద‌ర్శ‌కుడు ప్రాణాల‌తో పోరాడి ఓడిపోయాడు. ద‌ర్శ‌కుడిగా మంచి స్టేజ్‌లో ఉండాల‌ని ఎన్నో క‌ల‌లు క‌ని.. మొద‌టి సినిమా విడుద‌ల అవ్వ‌కముందే మ‌ర‌ణించిన ఈ ద‌ర్శ‌కుడి హ‌ఠాణ్మ‌ర‌ణం టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది.

  First published:

  ఉత్తమ కథలు