Home /News /movies /

ACTRESS BANGALORE PADMA COMMENTS ABOUT HER DAUGHTER GAYATRI RAO SB

Pawan Kalyan:పవన్ కళ్యాణ్ సినిమా వల్లే..నా కూతురు సినిమాలు మానేసింది..

గాయిత్రి రావు, శృతిహాసన్

గాయిత్రి రావు, శృతిహాసన్

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో తన కూతురి పాత్ర గురించి చెప్పింది ఒకటి.. చూపించింది మరొకటి అన్నారు బెంగళూరు పద్మ.దీంతో ఇక సినిమాలు చేయనని నిర్ణయం తీసుకుందన్నారు.

    ‘హ్యాపీడేస్‌’(Happy Days)ఈ సినిమ ఎంత హిట్ అయ్యిందో అందులో నటించిన వారంతా కూడా అంతే హిట్ అయ్యారు. అప్పటి యూత్‌ ఆడియెన్స్‌ని ఓ రేంజ్‌లో ఆకట్టుకుండి ఈ సినిమా. అయితే ఈ సినిమాలో బాయ్ కట్‌తో నటంచిన అమ్మాయి అందరికీ గుర్తే ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ పేరు అప్పు. నిజమైన పేరు గాయత్రి(Gayatri). హ్యాపిడేస్ సినిమాలో నిఖిల్‌(Nikhil) క్లోజ్ ఫ్రెండ్‌గా మూవ్‌ అయ్యే అప్పు అలియాస్‌ అపర్ణ. హ్యాపీడేస్‌ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అప్పు క్యారెక్టర్‌ని మర్చిపోలేరు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది గాయత్రీరావు. తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్నట్లు నటించింది. అయితే తాజాగా అప్పు తల్లి బెంగుళూరు పద్మ(Begalore Padma) .. ఓ ఇంటర్వ్యూలో అప్పుకు సినిమా కెరీర్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

    హ్యాపిడేస్ సినిమాలో అప్పు.. క్యారెక్టర్ విషయంలో ఆలోచించి సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఆ సినిమా కోసం బాయ్ కట్ చేయించుకోవాలని డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) చెప్పడంతో.. కాస్త ఇబ్బంది పడిందని...బాయ్ కట్ చేయించుకున్నాక కూడా చాలా బాధపడి ఏడ్చిందన్నారు. ఆ తర్వాత హ్యాపిడేస్ సినిమాలో అప్పు క్యారెక్టర్ చూసి అంతా బావుందని మెచ్చుకున్నారని పద్మ అన్నారు. తన కూతురు ఇప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉందన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లో నటించిన తర్వాతే .. గాయత్రి ఇక సినిమాలు చేయకూడాదని నిర్ణయం తీసుకుందన్నారు. హరీశ్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ముందుగా గాయత్రి క్యారెక్టర్ ట్రయాంగిల్ లవ్ అని చెప్పి తీసుకున్నారన్నారు. ఆ తర్వాత సినిమాలో విడుదలయ్యాక.. వేరేలా డిఫరెంట్ టాక్ వచ్చిందన్నారు.



    దీంతో ఆ సినిమా చేశాక తాను ఇక సినిమాలు చేయనని చెప్పిందన్నారు. సినిమాలు మానేసి చదువుకుందన్నారు. పీజీ పూర్తి చేసిందన్నారు. ఏదీ ఏమైనా వారి వల్లే ఇవాళ నా కూతురు మంచి నిర్ణయం తీసుకొని లైఫ్‌లో స్థిరపడిందన్నారు. వారందరికీ ధన్యవాదాలు అని అన్నారు బెంగుళూరు పద్మ. ఇక హ్యాపీడేస్ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘ఆరంజ్’పవన్ కల్యాణ్‌ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోనూ నటించిన గాయత్రిరావు.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో 2019లో వివాహం చేసుకొని చెన్నైలో సెటల్ అయిపోయింది.

    ఇక గాయత్రీ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆమె తల్లిదండ్రులు సినీ పరిశ్రమకు చెందిన వారు. తల్లి పేరు బెంగుళూర్ పద్మ. తండ్రి అరుణ్ కుమార్. పద్మ టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించారు.హ్యాపీ డేస్ సినిమాలో కూడా పద్మ నిఖిల్ కి అమ్మగా నటించింది. ఈమె పాత చిత్రాలలో చాలా హిట్ సినిమాల్లో కూడా నటించారు.ప్రస్తుతం ఆమె అనేక తెలుగు సీరియల్స్‌ కూడా నటిస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Bangalore, Harish Shankar, Pawan kalyan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు