• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACTRESS AVIKA GOR LEARNING KAZAKH LANGUAGE FOR MOVIE SHARES VIDEO MNJ

Avika Gor: ఆ దేశ భాష నేర్చుకుంటున్న చిన్నారి పెళ్లి కూతురు.. అప్పుడే ఇరగదీస్తుందిగా

Avika Gor: ఆ దేశ భాష నేర్చుకుంటున్న చిన్నారి పెళ్లి కూతురు.. అప్పుడే ఇరగదీస్తుందిగా

అవికా గోర్ (ఫైల్)

Avika Gor: ఉయ్యాల జంపాల ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. సినిమా చూపిస్తా మావలో ‘అమీ తుమీకి బాలో బాషి’ అని బెంగాళీ భాష‌లో అదరగొట్టి.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్‌ ఇప్పుడు కొత్త భాష నేర్చుకుంటోంది. ఓ సినిమా కోసం ఆమె ఆ దేశ భాష‌నే నేర్చుకోవ‌డం విశేషం.

  • Share this:
    Avika Gor: ఉయ్యాల జంపాల ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. సినిమా చూపిస్తా మావలో ‘అమీ తుమీకి బాలో బాషి’ అని బెంగాళీ భాష‌లో అదరగొట్టి.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్‌ ఇప్పుడు కొత్త భాష నేర్చుకుంటోంది. ఓ సినిమా కోసం ఆమె ఆ దేశ భాష‌నే నేర్చుకోవ‌డం విశేషం. అయితే ఇంత‌కు అవికా ఏ భాష‌ను నేర్చుకుంటోంది. ప్ర‌స్తుతం ఆ మూవీ షూటింగ్ ఎక్క‌డ జ‌రుగుతుంద‌న్న వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం అవికా క‌జ‌క్ భాష‌ను నేర్చుకుంటుంది. ఓ క‌జ‌క్ మూవీలో న‌టిస్తోన్న అవికా.. అందుకోసం ఆ భాష‌ను కూడా నేర్చుకుంటోంది. ఇక ఈ మూవీ షూటింగ్ ట‌ర్కీలో జ‌రుగుతుండ‌గా.. క‌జ‌క్‌ భాష‌లో మాట్లాడుతూ ఓ వీడియో పోస్ట్ కూడా పెట్టారు అవికా.

    ఆ వీడియోలో.. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు అవికా గోర్. క‌జ‌క్ మూవీలో న‌టించ‌డం కోసం నేను ఇవాళ అల‌న్య‌కు వ‌చ్చాను. నుర్లాన్ కోయంబ‌యేవ్ సినిమాలో న‌టిస్తున్నా అని ఆమె కామెంట్ పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో ఆమె అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.








    View this post on Instagram






    A post shared by Avika Gor (@avikagor)






    అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన అవికా.. ఇటీవ‌లే నిర్మాత‌గా మారారు. ఆవికా స్క్రీన్ క్రియేష‌న్స్ పేరిట ఒక నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించి ఆచార్య క్రియేషన్స్‌తో క‌లిసి ఓ సినిమాను నిర్మిస్తోంది. సాయి రోన‌క్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో అవికా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు