ACTRESS ARCHANA PURAN SINGH REVEALS ABOUT TIGER SHROFF FATHER JACKIE SHROFF IN KAPIL SHARMA SHOW TA
రూ.5 అప్పు చేసిన బాలీవుడ్ నటుడు.. ఎందుకో తెలుసా.. ?
జాకీ ష్రాఫ్
బాలీవుడ్ నటుడు అంటే కోట్లకు పడగలెత్తి ఉంటారు. వారికి డబ్బకు కొదవే ఉండదని అందరం అనుకుంటాం. కానీ ఈ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఒకనొక సందర్భంలో రూ. 5 అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ నటుడు అంటే కోట్లకు పడగలెత్తి ఉంటారు. వారికి డబ్బకు కొదవే ఉండదని అందరం అనుకుంటాం. కానీ ఈ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఒకనొక సందర్భంలో రూ. 5 అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే... జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ బాలీవుడ్లో హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా నటుడు నటుడు టైగర్ ష్రాఫ్.. కపిల్ శర్మ షోకు విచ్చేసాడు. అతనితో పాటు ఈ చిత్రంలో ఒక పాత్రలో నటించిన అర్చనా పూరన్ సింగ్ తో పాటు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించిన అనన్యా పాండే, తారా సుతారియా కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని సందడి చేసారు. ఈ సందర్భంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అర్చనా పూరన్ సింగ్.. టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్ గురించి ఈ షోలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో టైగర్ ష్రాఫ్
ఎందుకంటే నేను ఇండస్ట్రీలో పరిచయం అయిందే జాకీ ష్రాఫ్ సినిమాతోనే. ఇక మేమిద్దరం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోన్న సమయంలో జాకీ ష్రాఫ్ ఒకానొక సందర్భంలో తన దగ్గర రూ.5 అప్పు చేసాడు. అతను తీసుకున్న ఆ డబ్బును తన కోసం కాకుండా ఒక బిచ్చగాడికి దానం చేసాడు. తాను ఎంతో కష్టాల్లో ఉన్న కూడా తోటి వారి కష్టాలను చూసి చలించే గొప్ప గుణం జాకీ ష్రాఫ్‌లో ఉందన్నారు.
అర్చన పూరన్ సింగ్,జాకీ ఫ్రాఫ్
మరోవైపు నేను షూటింగ్ సందర్భంగా అలిసి పోయి వానిటీ వ్యాన్‌లో పడుకుంటే ..తన తలకింద దిండు పెట్టి వెళ్లారు. నేను ఎవరో ఆఫీస్ బాయ్ ఈ పనిచేసారని అనుకున్నాను. కానీ ఈ పని జాకీ ఫ్రాఫ్ గారే చేసారని ఆ తర్వాత తెలిసింది. అంతేకాదు నేను నిద్ర పోతున్న సమయంలో ఎవరు తనను డిస్ట్రబ్ చేయకుండా కాపాల కాయడం తనకు ఇప్పటికీ గుర్తుందన్నారు. ఈ షోలో అర్చన పూరన్ సింగ్.. జాకీ గురించి చెప్పిన విషయాలు చెప్పినపుడు షోలో ఆడియన్స్ ఒకటే చప్పట్లో మారు మోగింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.