Sudha Chandran: భారతీయ నృత్యంలో మయూరి సుధాచంద్రన్‌కి ప్రత్యేక స్థానం ఉంది. యాక్సిడెంట్లో కాలు పోగా.. కృత్రిమ కాలు పెట్టుకొని నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయానికి గురిచేసిన గొప్ప నృత్య కళాకారిణి సుధాచంద్రన్. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆమె జీవిత కథ ఆధారంగా 1985లో బయోపిక్ తెరకెక్కగా.. అందులో మయూరినే నటించారు. ఇక ఈ సినిమా అప్పట్లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శితమైంది. అలాగే 2014 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మరోసారి ప్రదర్శితమైంది. అంతేకాదు ఈ మూవీకి 14 నంది అవార్డులు కూడా లభించాయి. ఇక ఈ మూవీ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన సుధాచంద్రన్.. ఆ తరువాత పలు భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం బుల్లితెరపై కూడా సీరియల్స్‌లో మెరుస్తున్నారు. కాగా ఈ నటి తాజాగా అలీతో షోలో పాల్గొన్నారు. వచ్చే వారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. తాజాగా ప్రోమోను విడుదల చేశారు. అందులో తనకు సంబంధించిన పలు విషయాలను ఆమె షేర్ చేసుకున్నారు.
ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ బాగానడుస్తోంది. కానీ నిజానికి చెప్పాలంటే తన బయోపిక్‌నే మొట్టమొదటి బయోపిక్. ఆ సినిమా షూటింగ్ తరువాత నాకు రామోజీరావు బ్లాంక్ చెక్‌ని ఇచ్చారు. అప్పటి నుంచి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడూ తగ్గలేదు. పెరుగుతూనే ఉంది అని సుధాచంద్రన్ అన్నారు. ఇక తన అమ్మ తనను ఐఏఎస్, ఐఎఫ్ఎస్గా చూడాలనుకుంది కానీ దేవుడు రాసిన రాత వేరేలా ఉంది. అందుకే డ్యాన్సర్‌ని అయ్యా అని సుధాచంద్రన్ చెప్పుకొచ్చారు. ఇక మయూరి సినిమా చేసేందుకు తన తండ్రి ఒప్పుకున్నారని, కానీ అమ్మ ఒప్పుకోలేదని, షూటింగ్ మొదటి రోజు ఏడ్చేశానని సుధాచంద్రన్ తెలిపారు.
ఇక సడన్‌గా విలన్ అవతారం ఎందుకు ఎత్తారన్న ప్రశ్నకు.. పొట్టకూటి కోసం అంటూ నవ్వుతూ సైగలతో చెప్పారు సుధాచంద్రన్. 13 ఏళ్ల వయస్సులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కాలు పోయిందని.. ఆ యాక్సిడెంట్లో తనకే తక్కువ దెబ్బలు తగిలాయని ఆమె గుర్తుచేసుకున్నారు. అలాగే తన లవ్ మ్యారేజ్ గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు. తన భర్త పంజాబీ అని.. ముందు ఇంట్లో ఒప్పుకోలేదని.. సౌత్ ఇండియన్ అంటే కల్చర్ ఉంటుందని మా వాళ్లు అన్నారని.. అప్పుడు తన భర్త సౌతిండియాలో కల్చర్ ఉంటే.. పంజాబీలో అగ్రికల్చర్ ఉంటుందని అన్నారని తెలిపారు. ఇక ఈ ఇంటర్వ్యూలో తన యాక్సిడెంట్ విషయాలను కూడా ఆమె చెప్పారు. ఈ ప్రోమో ఆసక్తిగా ఉండగా.. వచ్చే వారం ఫుల్ ఎపిసోడ్ రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, Television News, Tollywood