మొన్న కారు... నేడు ఇల్లు... అదిరిందమ్మా హరితేజ

నటిగా ఇండస్ట్రీలో స్థిరపడుతున్న హరితేజ... తన కలలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటోంది.

news18-telugu
Updated: September 11, 2019, 4:34 PM IST
మొన్న కారు... నేడు ఇల్లు... అదిరిందమ్మా హరితేజ
హరితేజ
  • Share this:
కలలు కనడం ఎవరికైనా సాధ్యమే. కానీ వాటిని కొందరు మాత్రమే నెరవేర్చుకుంటారు. తాజాగా యాంకర్, నటి హరితేజ కూడా తన కలలను నెరవేర్చుకుంటోంది. బుల్లితెర నటిగా కెరీర్ మొదలుపెట్టిన హరితేజ... ఆ తరువాత యాంకర్‌గా, వెండితెర నటిగానూ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడ్డ హరితేజ...ఆఫర్లు వచ్చిన తరువాత మాత్రం వెనుతిరిగి చూసుకోలేదు. అ..ఆ సినిమాలో మంగమ్మగా ఫన్నీ క్యారెక్టర్‌లో కనిపించిన హరితేజ... ఆ తరువాత బిగ్ బాస్ రియాల్టీ షోలో తళుక్కుమంది. తృటిలో హరితేజ బిగ్ బాస్ టైటిల్‌ను మిస్ చేసుకున్నప్పటికీ... ఆ షో ద్వారా కావాల్సినంత గుర్తింపును సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న హరితేజ... తాజా చిరకాల కోరికను నిజం చేసుకుని తెగ మురిసిపోతోంది.

Actress hari teja, hari teja bought new house, hari teja dream house, hari teja bought new car, Volvo suv car, big boss hari teja, hari teja busy in Tollywood, anchor hari teja, నటి హరితేజ, కొత్త ఇంట్లోకి హరితేజ, కొత్త కారు కొన్న హరితేజ, వోల్వో కొత్త కారు, బిగ్ బాస్ హరితేజ, టాలీవుడ్‌లో హరితేజ బిజిబిజీ
భర్తతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న హరితేజ


ఏదో ఒకరోజు తనకు నచ్చిన విధంగా ఉండే సొంత ఇంటిని కొనుగోలు చేయాలని కలలను కన్న హరితేజ... ఎట్టకేలకు అదిరిపోయే లొకేషన్‌లో సౌకర్యవంతమైన ఇంటిని తన సొంతం చేసుకుంది. భర్తతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇంత కాలానికి తాను కన్న కలని నిజం చేసుకున్నానని తన భర్తతో కలిసి కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తున్న ఫొటోని ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసిన హరితేజ ఆసక్తికరమైన పోస్ట్‌ని పెట్టింది.

Actress hari teja, hari teja bought new house, hari teja dream house, hari teja bought new car, Volvo suv car, big boss hari teja, hari teja busy in Tollywood, anchor hari teja, నటి హరితేజ, కొత్త ఇంట్లోకి హరితేజ, కొత్త కారు కొన్న హరితేజ, వోల్వో కొత్త కారు, బిగ్ బాస్ హరితేజ, టాలీవుడ్‌లో హరితేజ బిజిబిజీ
కొత్త కారుతో హరితేజ(Image/Instagram)
ఇటీవల వోల్వో ఎస్‌యూవీ కారును కొనుగోలు చేసిన హరితేజ... ఆ కారు ముందు ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కారును స్వాగతం చెబుతూ కామెంట్ చేసింది. కారు కొన్న కొద్దిరోజులకే సొంత ఇంట్లోకి అడుగుపెట్టి తన మరో కలను నెరవేర్చుకుంది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత మంది సపోర్ట్ గా నిలిచారో.. ఎంత మంది తమ సహాయ సహకారాల్ని అందించారో అందరికీ థ్యాంక్స్ చెప్పింది. తన ఎదుగుదలకు కారణమైన వారితో తన ఆనందాన్ని పంచుకోవడానికే ఈ ఫొటోని షేర్ చేస్తున్నానని తెలిపింది హరితేజ.
First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు