రెండో పెళ్లి చేసుకున్న అమలా పాల్ మాజీ భర్త ఏ.ఎల్.విజయ్..

తాజాగా ఏ.ఎల్.విజయ్  వివాహాం ఈ గురువారం కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అంతేకాదు  ఏ.ఎల్.విజయ్‌కు చెందిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

news18-telugu
Updated: July 12, 2019, 9:25 PM IST
రెండో పెళ్లి చేసుకున్న అమలా పాల్ మాజీ భర్త ఏ.ఎల్.విజయ్..
ఏ.ఎల్.విజయ్ రెండో వివాహాం(పైల్ ఫోటో)
  • Share this:
అవును అమలా పాల్ మాజీ భర్త రెండో వివాహం చేసుకున్నాడు. అమలా పాల్ 2014లో ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. మూడేళ్ల కాపురం చేసిన తర్వాత ఇద్దరి మనస్పర్ధలు రావడంతో 2017లో వీళ్లిద్దరు  విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ హీరోయిన్‌గా తిరిగి బిజీ అయింది.విజయ్ డైరెక్షన్‌తో బిజీ అయ్యాడు. తాజాగా ఏ.ఎల్.విజయ్  జూన్ 29 తాను చెన్నైకి చెందిన ప్రముఖ డాక్టర్ ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు  ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏ.ఎల్.విజయ్  వివాహాం ఈ గురువారం కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అంతేకాదు  ఏ.ఎల్.విజయ్‌కు చెందిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్.. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ టైటిల్‌తో కంగాన రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, మలయాళంతో పాటు హిందీలో ఏకకాలంలో నిర్మించనున్నారు.First published: July 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>