#MeToo: ఖష్బూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదా?

‘మీటూ’ బాధితులకు బాసటగా నిలిచిన ఖుష్బూ...మీటూ ఉద్యమాన్ని హేళన చేసి మాట్లాడేవారికి ఘాటుగా రిప్లై ఇచ్చారు.

news18-telugu
Updated: October 13, 2018, 8:14 PM IST
#MeToo: ఖష్బూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదా?
సినీ నటి ఖుష్బూ
  • Share this:
మీ టూ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. భారత సినీ పరిశ్రమతో పాటు మీడియా, క్రికెట్, కార్పొరేట్ రంగాల్లోనూ మీటూ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్‌లో పలువురు సెలబ్రిటీలు మీ టూ సుడిగుండంలో చిక్కుకున్నారు. ఫలానా వారి చేత తమకు చేదు అనుభవం ఎదురైనట్లు పలువురు మహిళలు స్వయంగా ముందుకొచ్చి వారి భండారాన్ని బయటపెడుతున్నారు. ఇక నేరుగా విషయానికొస్తే...నటిగా తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని ప్రముఖ నటి ఖుష్బూ అన్నారు. కొందరు నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా ‘మీటూ’ గురించి ప్రశ్నించగా...ఆమె స్పందించారు.

మీ 40 ఏళ్ల సినీ కెరీర్‌లో వేధింపులు ఎదుర్కోలేదా?’ అని చాలా మంది నన్ను అడిగారు. మిమ్మల్ని నిరాశపర్చినందుకు క్షమించండి. నాకు వేధింపులు ఎదురుకాలేదు. నేను ఎప్పుడూ నాతో నేను పోరాటం చేసేదాన్ని, కష్టపడేదాన్ని. నా పారితోషికం సమయానికి పొందడానికి గట్టిగా మాట్లాడేదాన్ని. బాధితులు ప్రతి రంగంలోనూ ఉన్నారు.


ఖుష్బూ సుందర్, సినీ నటి


అటు ‘మీటూ’ బాధితులకు బాసటగా నిలిచిన ఖుష్బూ...మీటూ ఉద్యమాన్ని హేళన చేసి మాట్లాడేవారికి ఘాటుగా రిప్లై ఇచ్చారు. ధైర్యంగా తమ వేధింపుల గురించి చెప్పిన మహిళల కథలపై జోక్‌లు వేసుకోవడం సిగ్గుపడాల్సిన విషయమని పేర్కొన్నారు. ఓసారి మీరు మీ ఇంట్లోని మహిళతో మాట్లాడితే...మీకు డజన్ల ‘మీటూ’ కథలు చెబుతారని తాను కచ్చితంగా చెప్పగలనన్నారు. మీటూ బాధితులపై దయలేకుండా మాట్లాడటం ఆపాలని సూచించారు. ప్రతి కథలోనూ నిజం లేకపోవచ్చు కానీ, ప్రతి కేసును విచారించాల్సిన అవసరం ఉందన్నారు. అంత వరకు బాధిత మహిళలు ఈ బాధను భరించే శక్తిని ఆ దేవుడు ఇవ్వాలని ఖుష్బూ పేర్కొన్నారు.
Published by: Janardhan V
First published: October 13, 2018, 8:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading