సినిమా చూపిస్తా మావ…కథలో కథానాయకులు

సినిమా అంటే ఏంటి? సినిమా అంటే జీవితం. అవును... జివితంలో ఉండే ప్రతీ కోణం సినిమాలోనూ ఉంటుంది. అందుకే, సినిమా స్పృశించని రంగం భూమ్మీద ఏదీ లేదు. నేల మీద పని చేసే రైతులు మొదలుకొని నింగిలో చక్కర్లు కొట్టే పైలట్స్, అస్ట్రోనాట్స్ వరకూ అందరి జీవితాలూ సినిమాలో మనకు కనిపిస్తాయి. మరి అటువంటి సినిమా.. సినిమా నేపథ్యాన్ని కూడా ఒదిలిపెట్టలేదు.

news18-telugu
Updated: December 7, 2018, 1:04 PM IST
సినిమా చూపిస్తా మావ…కథలో కథానాయకులు
నటీనటులు పాత్రల్లో బాలకృష్ణ, కీర్తి సురేష్
news18-telugu
Updated: December 7, 2018, 1:04 PM IST
సినిమా అంటే ఏంటి? సినిమా అంటే జీవితం. అవును... జివితంలో ఉండే ప్రతీ కోణం సినిమాలోనూ ఉంటుంది. అందుకే, సినిమా స్పృశించని రంగం భూమ్మీద ఏదీ లేదు. నేల మీద పని చేసే రైతులు మొదలుకొని నింగిలో చక్కర్లు కొట్టే పైలట్స్, అస్ట్రోనాట్స్ వరకూ అందరి జీవితాలూ సినిమాలో మనకు కనిపిస్తాయి. మరి అటువంటి సినిమా.. సినిమా నేపథ్యాన్ని కూడా ఒదిలిపెట్టలేదు.

రీసెంట్‌గా అలనాటి మేటినటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ కూడా సినిమా నేపథ్యంలో తెరకెక్కిందే. మరోవైపు మహానటుడు ‘ఎన్టీఆర్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కతోన్న మూవీ కూడా సినిమా రంగానికి సంబంధించినదే.

‘మహానటి’ సినిమాలో కీర్తిసురేశ్


మరోవైపు మహానటుడు రామారావు కూడా ‘కథానాయకుని కథ’ అని సినిమా రంగానికి సంబంధించిన కథను చేయడం విశేషం.



‘ఎన్టీఆర్’ తర్వాతి తరానికి చెందిన కృష్ణ కూడా ‘డాక్టర్ సినీ యాక్టర్’, ‘ఇంద్ర భవనం’ వంటి సినిమాల్లో హీరో క్యారెక్టర్ చేయడం విశేషం. మరోవైపు ఎన్టీఆర్ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీ కంటే ముందు ‘పరమవీరచక్ర’లో సినిమా కథానాయకుడి పాత్రను పోషించాడు. ఫైనల్ గా బాక్సాఫీస్ ఫలితం ఎలా వున్నా సినిమాలో మరో సినీ వాతావరణం క్రియేట్ చేయటం... వెరైటీగా అనిపించింది చూసినవారికి!

‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీ
Loading....
మరోవైపు కమల్ హాసన్ హీరోగా నటించిన ఉత్తమ విలన్‌లో కమల్ హాసన్ నటుడిగా కనిపించాడు. మరోవైపు మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన ‘దొంగాట’ మూవీలో మంచు లక్ష్మీ హీరోయిన్ పాత్రను పోషించిడం విశేషం.

ఉత్తమ విలన్ (ఫేస్‌బుక్ ఫోటో)


మరోవైపు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సితార’లో భానుప్రియ కథానాయిక పాత్రనే పోషించింది. అంతకు ముందు అక్కినేని నాగేశ్వరరావు,  వాణిశ్రీ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘బంగారు బాబు’ మూవీలో వాణిశ్రీ..కథానాయిక పాత్రలో నటించడం విశేషం. రీసెంట్‌గా తెలుగులో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమ్మోహనం’లో కథానాయిక అతిథిరావు హైదరి..హీరోయిన్ పాత్రనే పోషించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.

సమ్మోహనం (ఫేస్‌బుక్ ఫోటో)


అంతకు ముందు ఆ తర్వాత..చాలా సినిమాల్లో  హీరో పాత్రలను కమెడియన్స్‌తో చేయించి ఆడియన్స్‌ను నవ్వించే ప్రయత్నం చేసారు మన దర్శక నిర్మాతలు. అందులో ‘దుబాయి శ్రీను’, ‘దూకుడు’, ‘దోచేయ్’ వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి.

హీరోల పాత్రల్లో కామెడీ పండించిన బ్రహ్మీ, ఎంఎస్


ఇక రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో సినీ నేపథ్య సినిమా ‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ . ఈ మూవీ  ఔట్ అండ్ ఔట్ వర్మ మార్క్ హిలేరియస్ మూవీ.  దర్శకత్వం చేయటానికి ఫిల్మ్ నగర్ వచ్చిన ఓ అప్ కమింగ్ డైరెక్టర్ తంటాలు చూపిస్తాడు ఆర్జీవీ. ఆ పాత్రలో సునీల్ అద్భుతంగా నటించాడు.

అప్పల్రాజులో సునీల్ (ఫేస్‌బుక్ ఫోటో)


సినిమా వాళ్ల జీవితాల్నే సినిమాలుగా చూపటం ఇప్పుడు కొత్తేం కాదు. ఒకప్పటి సినిమాల్లోనూ సినిమా దర్శనమిచ్చింది. హీరో గురించో, హీరోయిన్ గురించో, అప్పుడప్పుడూ సింగర్స్ గురించో సినిమాలు తీశారు మన వాళ్లు. అలా వచ్చినవే ‘డాక్టర్ సినీ యాక్టర్’, ‘ఇంధ్ర భవనం’, ‘కథానాయకుడి కథ’తో పాటు ‘శివరంజనీ’, ‘అద్దాల మేడ’ వంటి మొదలైన సినిమాలు ఫిల్మ్ నేపథ్యంలో తెరకెక్కినవే.

శివరంజని (యూట్యూబ్ క్రెడిట్)


ఒకప్పటి హీరోలు మొదలు పెట్టిన సంప్రదాయాన్ని ఇప్పటి వారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ మలయాళ హిట్ మూవీని కుచేలన్, కథానాయకుడు పేర్లతో తెలుగు, తమిళ్ భాషల్లోకి రీమేక్ చేశాడు. స్నేహితుడి కోసం స్టార్‌డమ్ ని పక్కన పెట్టే పాత్రలో అద్భుతంగా నటించాడు. ఎంత సూపర్ స్టార్ అయినా మిత్రుడ్ని మరిచిపోని తన రియల్ లైఫ్ క్యారెక్టర్నే సినిమాలో అవలీలగా ప్లే చేశాడు.

రజినీకాంత్ కథానాయకుడు (ఫేస్‌బుక్ ఫోటో)


సౌత్‌లో రజినీ చేసిన స్టోరీనే ‘బిల్లు బార్బర్’ పేరుతో హిందీలో రీమేక్ చేశాడు షారుఖ్ ఖాన్. ఆయన కూడా తన రియల్ లైఫ్ ఇమేజ్ అయిన బాలీవుడ్ బాద్షానే తెర మీద కనిపించాడు. అయితే,‘బిల్లు బార్బర్’ కూడా ‘కథానాయకుడు’లా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సంచలనాలు నమోదు చేయలేకపోయింది.

షారుఖ్ బిల్లు బార్బర్ (యూట్యూబ్ క్రెడిట్)


రజినీకాంత్, షారుఖ్ ఖాన్ లాంటి హీరోలు తెర మీద కూడా హీరోలుగా కనిపిస్తే కమల్ వెరైటీ పాత్రను ఎంచుకున్నాడు. ‘ఉత్తమ విలన్’లో కథానాయకుడి పాత్రను పోషించిన కమల్...‘మన్మథ బాణం’ సినిమాలో ఓ హీరోయిన్ని ఫాలో అయ్యే డిటెక్టివ్ గా అలరించాడు. ఒక సినిమా హీరోయిన్ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వుంటాయో ఇందులో చక్కగా చూపించాడు దర్శకుడు.

సినిమాలో సినిమాని చూపించటంలో రెండు రకాల పద్ధతులు కనిపిస్తాయి మనకి. ఒకటి సినిమాలో సినిమా హీరోనో, హీరోయిన్నో తమ లీడ్ రోల్స్ గా పెట్టుకుని కథ నడపటం. అయితే, ఇలాంటి స్టోరీస్‌లో సినిమా ప్రపంచం పెద్దగా కనిపించదు. హీరోదిగాని, హీరోయిన్‌ది గాని పర్సనల్ లవ్ స్టోరీనే ప్రధానమైపోతుంది. కాని, రెండో టైపు సినిమాల్లో సినిమా రంగమే ఇంపార్టెంట్‌గా మారిపోతుంది. ఫిల్మ్ నగర్ కష్టాలు, కృష్ణ నగర్ కన్నీళ్లు... ఇవ్వి కథకి మూలం అవుతాయి..

తెలుగులో సినిమా పరిశ్రమ నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ... పూర్తిగా సినీ సినిమా అని చెప్పుకోటానికి వీలయ్యేలా తీసినవి... ‘నేనింతే’, ‘ఖడ్గం’ సినిమాలు. కృష్ణవంశీ  తెరకెక్కించిన ‘ఖడ్గం’ సినిమా మెయిన్ గా దేశభక్తి చిత్రం అయినప్పటికీ... రవితేజ క్యారెక్టర్ తో సినిమా రంగానికి లింక్ చేస్తాడు స్టోరీని. అక్కడి రంగుల ప్రపంచంలో వుండే విషాదా కోణాల్ని ప్రేక్షకులకి చూపే ప్రయత్నం చేస్తాడు.

‘ఖడ్గం‌’ సినిమాలో ఒక భాగం మాత్రమే సినిమా లోకం అయితే...‘నేనింతే’లో మొత్తానికి మొత్తం సినిమానే. కృష్ణానగర్ వీధుల్లో సినిమా అనే కల, సినిమా కళ... ఎలా పెల్లుబికి ప్రవహిస్తుంటుందో డైరెక్టర్ పూరీ హృద్యంగా చూపాడు. రవితేజ నటించటం కాక జీవించాడు.ఈ మూవీలోనటనకు రవితేజ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు.

నేనింతే (యూట్యూబ్ క్రెడిట్)


రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్లీ’ కూడా సినీ నేపథ్యానికి లింక్ చేసి తెరకెక్కించారు. ఈ మూవీలో చరణ్..స్టంట్ మాస్టర్ పాత్రలో నటించాడు. ఈ మూవీలో చిరంజీవి తన నిజ జీవిత పాత్రలో నటించారు. అంతకు ముందు ‘స్టైల్’..రాజేంద్రప్రసాద్ ‘మేడమ్’ మూవీస్‌లో చిరు..తన పాత్రలో కనిపించడం విశేషం.

బ్రూస్‌లీలో చిరంజీవి


ఇక నాగార్జున కూడా ‘రావుగారిల్లు’ ‘స్టైల్’, ‘తకిట తకిట’ సినిమాల్లో తన నిజ జీవిత పాత్రైన హీరోగా నటించి మెప్పించారు.

టాలీవుడ్ మరో యంగ్ హీరో నాగ చైతన్య సినీ సినిమా విషయంలో కొంచెం ముందున్నాడు. ‘ఏ మాయ చేసావే’తో ఆ జానర్ లో ఆల్రెడీ సినిమా చేసేశాడు. ఈ మూవీలో చైతూ అసిస్టెంట్ డైరెక్టర్ గా మెప్పించాడు. ఆ తర్వాత ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ మూవీలో తన నిజ జీవిత పాత్రలో కనిపించడం కొసమెరుపు.

ఏమాయ చేసావే మూవీ


హిందీ సినిమా వాళ్లు కూడా తమకు వీలైనప్పుడల్లా సినిమాని సినిమాలోకి తెచ్చేశారు. తమ హీరోని స్టోరీలోనూ సినిమా హీరోగా చూపించటమో... లేదంటే తమ కథానాయికని కథలోనూ హీరోయిన్‌గా చూపించటమో చేస్తూ వచ్చారు. రీసెంట్‌గా బ్లాక్ బస్టర్స్ అయిన సినీ సినిమాలు కూడా వున్నాయి...

షారుఖ్ ఖాన్ సినిమా నేపథ్యంలో సినిమా చేయటం ‘బిల్లు బార్బర్’లోనే కాదు ‘ఓం శాంతి ఓం’లో కూడా జరిగింది. రెండు జన్మల కథ అయిన ‘ఓం శాంతి ఓం’లో ఓ సారి స్ట్రగ్‌లింగ్ యాక్టర్ అయితే మరోసారి సూపర్ స్టార్. రెండూ పాత్రల్లోనూ బాద్షా అదరగొట్టేస్తే... ఫస్ట్ మూవీలోనే సినిమా హీరోయిన్ గా దీపిక వెలిగిపోయింది.

ఓం శాంతి ఓం మూవీలో షారుఖ్, దీపికా


ఆ తర్వాత ‘ఫ్యాన్’ మూవీలో షారుఖ్..హీరో పాత్రలో ఆయనకు అభిమానిగా రెండు పాత్రల్లో అలరించాడు. ఇక అమితాబ్..తన నిజ జీవిత పాత్రలను ఎన్నో సినిమాల్లో పోషించడం విశేషం.

ఫ్యాన్ మూవీలో షారుఖ్ ఖాన్


తన ఒక్కో సినిమాకి ఒక్కో రంగాన్ని ఎంచుకునే మథుర్ బండార్కర్ తీసిన సినిమా ‘హీరోయిన్’. కరీనా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో... ఆమె రోల్ హీరోయినే! తెర మీద కూడా కథానాయికగా కనిపించిన బెబో అవలీలగా ఆకట్టుకుంది. మేకప్ పొరల మాటున రహస్యాల్ని బండార్కర్ సూటిగా చెప్పాడు. అటు సిల్క్‌స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’ కూడా సినీ నేపథ్యంలోనే తెరకెక్కింది.

డర్టీ పిక్చర్ (ఫేస్‌బుక్ పోటో)


మొత్తానికి మన సినిమాల్లో సినీ నేపథ్యంతో తెరకెక్కడం పెద్ద విచిత్రమనే చెప్పాలి.

ఇది కూడా చదవండి 

‘బొమ్మ‌రిల్లు’ బ్యూటీ రీ ఎంట్రీ.. మళ్లీ తెరపై జెనిలియా..

రూ.300 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు ‘గంట’ కొట్టిన విక్రమ్

నందమూరి హీరోల అరుదైన రికార్డు

 
First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Countdown
Countdown To Assembly Elections 2018 Results
  • 01 d
  • 12 h
  • 38 m
  • 09 s
To Assembly Elections 2018 Results