హోమ్ /వార్తలు /సినిమా /

ప్రముఖ కమెడియన్ సూరి ఫిర్యాదు.. హీరో విష్ణు విశాల్ తండ్రిపై కేసు నమోదు

ప్రముఖ కమెడియన్ సూరి ఫిర్యాదు.. హీరో విష్ణు విశాల్ తండ్రిపై కేసు నమోదు

ఫొటో క్రెడిట్-Twitter/Actor Soori

ఫొటో క్రెడిట్-Twitter/Actor Soori

ప్రముఖ తమిళ హాస్య నటుడు  సూరిని మోసం చేసిన నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినవారిలో హీరో విష్ణు విశాల్ తండ్రి, మాజీ ఐపీఎస్ అధికారి రమేష్, సినీ నిర్మాత అన్బువేల్‌ రాజన్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు.

ఇంకా చదవండి ...

  ప్రముఖ తమిళ హాస్య నటుడు  సూరిని మోసం చేసిన నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినవారిలో హీరో విష్ణు విశాల్ తండ్రి, మాజీ ఐపీఎస్ అధికారి రమేష్, సినీ నిర్మాత అన్బువేల్‌ రాజన్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. భూమి కొనుగోలుకు సంబంధించి తనకు మోసం జరిగిందని సూరి పోలీసులు అడయార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు పంపించారు.

  సూరి తన ఫిర్యాదులో.. "రమేష్ అనే వ్యక్తి 2015 నుంచి తెలుసు. వీర ధీర సూరన్ మూవీ కోసం అతను నన్ను సంప్రదించాడు. అందులో అతని కుమారుడు లీడ్ రోల్ చేశాడు. ఈ సినిమాకు 40 లక్షల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత సినిమా పేరును కధనాయగన్‌ గా మార్చారు. ఆ తర్వాత 32 రోజుల పాటు రీషూట్ చేశారు. అందుకు నాకు ఎలాంటి అదనపు సొమ్ము చెల్లించలేదు. మరోవైపు రమేష్, అతని స్నేహితుడు సినీ నిర్మాత అన్బువేల్‌రాజన్‌తో కలిసి కొన్ని ప్రాపర్టీస్ చూపించి అందులో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరారు. అయితే నేను మాత్రం అందుకు ఒప్పుకోలేదు. భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

  అయితే పలుమార్లు చర్చించిన తర్వాత సిరుశేరిలోని 1.83 ఎకరాల భూమి కొనుగోలుకు అంగీకారం కుదిరింది. ఆ స్థలం అనంతన్, లోగనాథన్‌కు చెందినదని.. తాను ఎజెంట్‌గా ఉన్నానని అన్బువేల్‌రాజన్ చెప్పాడు.. ఈ క్రమంలోనే తాను 2.15 కోట్ల రూపాయలను పలు వాయిదాల్లో అనంతన్, లోగనాథన్, అన్బువేల్‌రాజన్‌కు చెల్లించినట్టు చెప్పాడు. అయితే ఆ తర్వాత అన్బువేల్‌రాజన్‌ కొన్ని పత్రాలతో ఫాబ్రికేట్ చేసినట్టుగా గుర్తించానని సూరి తెలిపాడు. తనను 2.69 కోట్లు మోసం చేశాడు" అని ఆరోపించాడు. ఈ మేరకు తన ఫిర్యాదును అడయార్ పోలీసులకు మెయిల్ ద్వారా పంపించారు.

  మరోవైపు విష్ణు విశాల్ తన తండ్రిపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు చాలా బాధ కలిగించాయని అన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇక, పలు చిత్రాల్లో కలిసి నటించిన విష్ణు విశాల్, సూరి మంచి స్నేహితులుగా ఉన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Vishnu Vishal

  ఉత్తమ కథలు