హీరోయిన్ వరలక్ష్మిపై నోరు జారిన హీరో.. ఎంత మాట అనేశాడు..

Vimal Controversial comments on Varalaxmi : 'కాన్ని రాశి' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో విమల్ హీరోయిన్ వరలక్ష్మిపై నోరు జారాడు. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

news18-telugu
Updated: August 14, 2019, 10:38 AM IST
హీరోయిన్ వరలక్ష్మిపై నోరు జారిన హీరో.. ఎంత మాట అనేశాడు..
విమల్,వరలక్ష్మి శరత్ కుమార్ (File Photos)
news18-telugu
Updated: August 14, 2019, 10:38 AM IST
తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్‌పై హీరో విమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వరలక్ష్మిని మగాడిగా అభివర్ణించిన విమల్.. ఆపై తన కామెంట్స్‌ను కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కలిసి నటించిన 'కాన్ని రాశి' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విమల్ నోరు జారాడు. సినిమాల్లో తాను తొలిసారి ఓ మగాడికి జోడిగా నటిస్తున్నానని వరలక్ష్మిని ఉద్దేశించి అన్నాడు.అంటే, తన ఉద్దేశం.. వరలక్ష్మితో కలిసి పనిచేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని చెప్పడమేనని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే వరలక్ష్మిని మగాడిగా అభివర్ణించడంతో విమల్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక ఇదే ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రస్తావించిన వరలక్ష్మి.. తనకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. కాన్ని రాశి సినిమా ప్రేమ వివాహం నేపథ్యంలో తెరకెక్కడంతో.. సినిమా ప్రమోషన్స్‌లో వరలక్ష్మికి అవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రేమ వివాహమా..? పెద్దలు కుదిర్చిన వివాహమా..? అన్నది పక్కనపెడితే.. అసలు పెళ్లి ఆలోచనే తన మదిలో లేదని తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...