
‘బిగిల్’ మూవీలో విజయ్
vijay| ఈ సంస్థలో గత కొన్నేళ్లుగా ఆర్థిక అవకతవకలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుకున్న ఐటీ అధికారులు, బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. మాస్టర్ సినిమా షూటింగ్లో ఉన్న హీరో విజయ్ను సైతం దాదాపు ఐదు గంటలపాటు విచారించారు.
vijay| తమిళ సూపర్ స్టార్ విజయ్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ వరుస దాడులు చేసింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సహా పలు సంస్థలపై ఏకకాలంలో దాడులు చేసింది. దాదాపు 20 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల విజయ్ నటించిన బిగిల్ సినిమా ఏజీఎస్ సంస్థ బ్యానర్ కింద నిర్మించారు. ఈ సంస్థలో గత కొన్నేళ్లుగా ఆర్థిక అవకతవకలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుకున్న ఐటీ అధికారులు, బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. మాస్టర్ సినిమా షూటింగ్లో ఉన్న హీరో విజయ్ను సైతం దాదాపు ఐదు గంటలపాటు విచారించారు. అయితే బిగిల్ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్, అలాగే ఆదాయానికి తగిన ఆధారాలకు సంబంధించిన విషయాలపై ఆయనను విచారించారు. ఇంకా విజయ్ కు చెందిన ఇతర సంస్థలపై విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా.. మరోసారి విజయ్ను ఐటీ శాఖ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదిలా ఉంటే గతంలో సైతం విజయ్ కు చెందిన సినీ నిర్మాణ సంస్థలపై ఐటీ శాఖ ఇదే తరహాలో రెయిడ్స్ జరిపింది.
Published by:Krishna Adithya
First published:February 05, 2020, 23:21 IST