లిప్ లాక్ సీన్‌లతో వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం : విజయ్ దేవరకొండ

సిినిమాల్లో లిప్ లాక్‌ల సంప్రదాయం ఇప్పటిది కాదు... దాదాపు సినీ పరిశ్రమ పుట్టిననాటి నుంచే ఉంది. అయితే అది ఎక్కువుగా హాలీవుడ్ చిత్రాల్లో కనపడేది. ప్రస్తుతం కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో కూడా ఎక్కువుగానే కనిపిస్తుంది.

news18-telugu
Updated: July 19, 2019, 12:41 PM IST
లిప్ లాక్ సీన్‌లతో వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం : విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ Photo: Instagram.com/thedeverakonda/
  • Share this:
లిప్ లాక్ కిస్‌ల సంప్రదాయం ఇప్పటిది కాదు... దాదాపు సినీ పరిశ్రమ పుట్టిననాటి నుంచే ఉంది. అయితే అది ఎక్కువుగా హాలీవుడ్ చిత్రాల్లో కనపడేది. కొన్ని సంవత్సరాల నుండి మన దేశ సినిమాల్లోనూ తప్పనిసరిగా మారింది. యూత్‌ను టార్గెట్ చేసే సినిమాల్లో తప్పనిసరిగా ఈ లిప్ లాక్ కిస్ ఉండాలన్న సంప్రదాయం ప్రచారంలో ఉంది. అంతేకాదు దాన్ని హిందీ సినిమాలు తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిప్ లాక్‌లు  సౌత్ ఇండియన్ సినిమాల్లో కూడా ఎక్కువుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సీన్లలో నటించడానికి కొందరు హీరోయిన్స్ మొదట్లో నో అన్నా.... తర్వాత తమ తోటి హీరోయిన్స్ ఆ కిస్ సీన్లలతో వార్తల్లో ఉండటం,  పేరు తెచ్చుకోవటం చూసి తామూ సై అంటున్నారు. అది అలా ఉంటే విజయ్ దేవరకొండ.. ఇటీవల 'డియర్ కామ్రేడ్' సినిమా ప్రమోషన్లో భాగంగా చెన్నైలో మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంలో లిప్ లాక్‌ల ప్రస్తావన రాగా, ఆ ప్రశ్నలకి జవాబుగా ... కథ అవసరాన్ని బట్టి...  ప్రేక్షకులను ద‌ృష్టిలో పెట్టుకొని.. వారికి కొంత ఎక్స్‌ట్రా కిక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే  హీరో హీరోయిన్స్‌తో  కొన్ని సినిమాల్లో  ముద్దు సీన్లు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సీన్లు చేయడం వల్ల కొందరు మా గురించి హేళనగా మాట్లాడతున్నారు. 

View this post on Instagram
 

This Sunday. The 12th of May. You will experience what I call "The Song of the Year" #DearComrade


A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on


అంతేకాకుండా సినిమాల్లో మేము నటించే కొన్ని సీన్స్.. నిజ జీవితంలో మా కేరక్టర్స్ పై ప్రభావం చూపుతాయి. ఈ సీన్లు ఆడియన్స్‌కు వినోదం పంచినప్పటికీ వ్యక్తిగతంగా మాకు ఇబ్బందులు ఎదురవుతాయి అంటు సమాధానమిచ్చాడు విజయ్. ఇలాంటి సీన్లతో ప్రజలలో హేళన భావం ఉంటుందని, మాగురించి చెడుగా చర్చించుకుంటారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సీన్ల వెనకగాని, సినిమా వెనుకగాని ఎంతో మంది కష్టం , భవిషత్తు ఉన్నాయని అన్నారు దేవరకొండ. సినిమాలు చూసి మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడినపుడు చాలా బాధేస్తుంది. కానీ అన్నీ భరిస్తాం. సినిమా రిలీజైన తర్వాత లభించే విజయంతో అవన్నీ మరిచిపోతాం. అందుకే ప్రేక్షకులు కూడా సినిమాని సినిమాలాగే చుడాలి. సినిమాలు వినోదం పంచడం కోసమే మా ముఖ్య ఉద్దేశం.. అంతేకాని సినిమాలతో నిజజీవితాన్ని ముడిపెట్టకూడదు అన్నారు.. విజయ్.
First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>