Hero Venkatesh: నాన్నకు ప్రేమతో.. భావోద్వేగానికి గురైన హీరో వెంకటేష్

వెంకటేష్ (File/Photo)

Hero Venkatesh: జీవించినంత కాలం సినిమానే ప్రేమించిన రామానాయుడు.. అనేక భాషల్లో సినిమాలు నిర్మించి ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు.

  • Share this:
    టాలీవుడ్‌లో రామానాయుడుకు ఎంతో ప్రత్యేకత ఉంది. టాలీవుడ్‌లో నిర్మాతకు ఓ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన అతికొద్ది మంది నిర్మాతల్లో ఆయన ఒకరు. ఓ నిర్మాతగా హీరో రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్నది కూడా ఆయనొక్కరే అని చెప్పాలి. జీవించినంత కాలం సినిమానే ప్రేమించిన రామానాయుడు.. అనేక భాషల్లో సినిమాలు నిర్మించి ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. అలాంటి రామానాయుడు కన్నుమూసి నేటికి సరిగ్గా ఆరేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిపోయారు ఆయన తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.

    ఇన్నేళ్లు గడిచినా.. ఈ రోజు మిగిల్చిన చేదు అనుభవాన్ని మాత్రం అంత ఈజీగా మరవకలేకపోతున్నామని హీరో వెంకటేష్ అన్నారు. ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు నాన్న అంటూ భావోద్వేగానికి గురయ్యారు. లవ్ యూ, మిస్ యూ నాన్న అంటూ ట్వీట్ చేశారు.



    రామానాయుడు వర్థంతి సందర్భంగా ఆయన పెద్ద కూమారుడు, నిర్మాత సురేష్‌ బాబుకు తండ్రి ఘన నివాళులు అర్పించారు. ఫిల్మ్ నగర్‌లోని రామానాయడు విగ్రహానికి సురేష్ బాబుతో పాటు పలువురు రామానాయుడు సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: