వెంకీమామ షూటింగ్‌లో వెంకటేష్‌కు గాయాలు.. దవాఖానకు తరలింపు...

Venkatesh injured : నటుడు విక్టరీ వెంకటేష్‌కు గాయాలు అయ్యాయి. బాబీ దర్శకత్వంలో తెరెక్కుతున్న వెంకీ మామ చిత్రంలో ఓ పాటను చిత్రీకరిస్తుండగా వెంకటేష్‌ స్వల్పంగా గాయపడ్డారు.

news18-telugu
Updated: August 18, 2019, 8:37 AM IST
వెంకీమామ షూటింగ్‌లో వెంకటేష్‌కు గాయాలు.. దవాఖానకు తరలింపు...
Photo: facebook.com/VenkateshDaggubati
  • Share this:
Venkatesh injured : నటుడు విక్టరీ వెంకటేష్‌కు గాయాలు అయ్యాయి. బాబీ దర్శకత్వంలో తెరెక్కుతున్న 'వెంకీ మామ' చిత్రంలో ఓ పాటను చిత్రీకరిస్తుండగా వెంకటేష్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఓ పాటకు డ్యాన్స్‌ చేస్తుండగా వెంకీ కాలు బెణికింది. దాంతో వెంటనే షూటింగ్‌ని నిలిపివేసి వెంకటేష్‌ను దవాఖానకు తరతించారు. 'వెంకీ మామ'లో వెంకటేష్, నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. వెంకటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌లపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు డాన్స్ మాస్టర్ రాజు సుందరం. అందులో భాగంగా డాన్స్ చేస్తున్న వెంకీ కాలు బెణికింది. 
Loading...

View this post on Instagram
 

#VenkyMamaFirstLook


A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) on

వెంకీ కాలిగాయాన్ని పరీక్షించిన డాక్టర్స్.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. కాలి మడిమకు దెబ్బ తగలడంతో పరుగెత్తడం, ఫైటింగ్ చేయడం లాంటివి కష్టం అంటున్నారు డాక్టర్స్. దీంతో 'వెంకీ మామ' షూటింగ్‌కి కొద్దిరోజులు గ్యాప్ వచ్చే అవకాశం వుంది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 4 న విడుదల కావాలి. వెంకటేష్ కాలి గాయంతో.. వెంకీ మామ విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగచైతన్యకు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది.
First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...