’ఐరన్ మ్యాన్’ గా బాలకృష్ణ.. దర్శకుడు ఎవరంటే..

టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ‘ఐరన్ మ్యాన్’గా కనిపించబోతున్నాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: October 17, 2019, 7:32 AM IST
’ఐరన్ మ్యాన్’ గా బాలకృష్ణ.. దర్శకుడు ఎవరంటే..
బాలయ్య న్యూ లుక్
  • Share this:
టాలీవుడ్ సీనియర్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ, వైరెటీ చిత్రాల దర్శకుడు రవిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతుందా. అంతేకాదు ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయిందా ..వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌లో ఒక్కో డైరెక్టర్‌కు ఒక్కో స్టైల్ ఉంటుంది. అలాగే దర్శకుడు, నటుడు రవిబాబు కంటూ ప్రత్యేక శైలి ఉంది. ఆయన సినిమాలు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ఫస్ట్ మూవీ ‘అల్లరి’ నుంచి ‘అనసూయ’, ‘నచ్చావులే’, ‘అమరావతి’, ‘అవును’, ‘అవును 2’ వంటి దేనికవే విభిన్న కథాచిత్రాలనే రూపొందించారాయన. రీసెంట్‌గా ‘అదుగో’ అంటూ పంది పిల్లతో ఒక ప్రయోగాత్మక చిత్రం చేసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు. తాజాగా రవిబాబు ‘ఆవిరి’ అనే వైరెటీ టైటిల్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆయన ఆలీతో జాలీగా ప్రోగ్రామ్‌లో పాల్గొని తన మనసులోని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలీ.. రవిబాబును కొన్ని ప్రశ్నలు వేసాడు. అందులో భాగంగా ఒక వేళ బాలకృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

actor cum director ravibabu says ali tho talk show if due with film nandamuri balakrishna title as iron man,balakrishna,ravibabu,ravi babu,balakrishna nandamuri,nbk.balakrishna ravi babu,balakrishna ravi babu aaviri,balakrishna ravi babu iron man film,balakrishna iron man film,balakrishna ruler,balakrishna facebook,balakrishna twitter,balakrishna instagram,ravi babu twitter,ravi babu instgram,ravi babu facebook,aviri movie trailer talk,ravi babu ali tho talk show,tollywood,telugu cinema,ఆలీ,ఆలీ తో జాలీగా,రవిబాబు ఆలీ,రవిబాబు ఆలీ బాలకృష్ణ, బాలకృ
బాలకృష్ణ, రవిబాబు (Twitter/Photos)


బాలయ్య  ఎపుడు తనతో నువ్వు అందరితో సినిమాలు తీస్తావు. నాతో ఎందుకు తీయవు అంటూ గొడవపడుతుంటారని ఈ సందర్భంగా గుర్తు చేసారు రవిబాబు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత నాకు ఫోన్ చేసి ఇదే విషయాన్ని అడిగారు. అపుడు నేను మీ సినిమాకు దర్శకత్వం వహించడం నాకు గౌరవం అన్నాను. దానికి బాలయ్య కూడా మీ దర్శకత్వంలో నటించడం నాకు గౌరవం అన్నారు. ఆయనతో వ్యక్తిగతంగా మంచి అటాచ్‌మెంట్ ఉందన్నారు రవిబాబు. మరోవైపు ఆలీ రవిబాబుతో మాట్లాడుతూ.. ఒకవేళ బాలయ్యతో సినిమా చేస్తే ఎలాంటి సినిమా చేస్తారని ప్రశ్నించాడు.  దానికి రవిబాబు స్పందిస్తూ.. బాలకృష్ణతో ఏ సినిమా చేసిన టైటిల్ మాత్రం ‘ఐరన్ మ్యాన్’ అంటూ షాకింగ్  సమాధానమిచ్చాడు. మొత్తానికి ఈ కాంబినేషన్ సెట్ అయిన కాకపోయినా.. ‘ఐరన్ మ్యాన్’ టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు