Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో (Tollywood Drugs Case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇప్పటికే పలువురు సినీ నటులు, దర్శకులను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు నటుడు తరుణ్‌ను విచారిస్తున్నారు. డ్రగ్స్ విక్రేత కెల్విన్ అప్రూవర్ గా మారి ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు ఈ విచారణ చేస్తున్నారు.. తరుణ్‌ను (Tharun) ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో అనుమానాస్పద లావాదేవీల గురించి విచారించనున్నారు. అలాగే డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలు, డ్రగ్స్ తీసుకున్నారా అన్న విషయాలపై అధికారులు విచారించనున్నారని తెలుస్తోంది.
డ్రగ్స్ కేసు విచారణ..
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారుల సమన్లు అందుకున్న 12 మందిలో చివరి వ్యక్తి తరుణ్. దీంతో ఆయన బుధవారం ఈడీ అధికారుల ఎదుట హాజరైయారు. 2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు రంగంలోకి దిగి ప్రశ్నిస్తున్నారు.
కెల్విన్ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపిన వివరాల ఆధారంగా ఈడీ అధికారులు మొత్తం 12 మందికి సమన్లు జారీ చేశారు. విచారణలో ముఖ్యంగా కెల్విన్‌తో సంబంధాలు, గతంలో ఎక్సైజ్ కేసు విచారణ సందర్భంగా చెప్పిన అంశాలపైనా ఆరా తీయనున్నారట.
టాలీవుడ్‌కు చెందిన 12 మందికి నోటీసులు :
ఈ విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హవాల రూపంలో జరిగిన లావాదేవీలపై ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటోంది. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న నటీనటులకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తోంది. అందులో భాగంగా మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే ఇదే కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ప్రముఖ నటి, నిర్మాత (Charmi) ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet), నందు (Nandu), రవితేజ (Raviteja), రానా, నవదీప్ , ముమైత్ ఖాన్‌ల (Mumaith Khan)ను, తనీష్(Actor Tanish )ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కెల్విన్‌తో వీరికి ఉన్న సంబంధాల పైన విచారణ జరిపారు అధికారులు. అలాగే వారి బ్యాక్ లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు.
ఇక తరుణ్ (Actor Tharun) సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం సినిమాలను తగ్గించేశారు. అయితే అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్పలో మలయాళీ నటుడు ఫహద్ పాజిల్‌కు తరుణ్ డబ్బింగ్ చెబుతున్నారని టాక్ నడిచింది. ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.