Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో (Tollywood Drugs Case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇప్పటికే పలువురు సినీ నటులు, దర్శకులను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు యువ నటుడు తనీష్‌ను విచారిస్తున్నారు. డ్రగ్స్ విక్రేత కెల్విన్ అప్రూవర్ గా మారి ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు ఈ విచారణ చేస్తున్నారు. శుక్రవారం హీరో తనీష్ ఈడీ విచారణకు హాజరయ్యారు. తనీష్‌ను (Tanish) ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో అనుమానాస్పద లావాదేవీల గురించి విచారించనున్నారు. అలాగే డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలు, ఎఫ్ క్లబ్‌లో జరిగే పార్టీలకు హాజరు, డ్రగ్స్ తీసుకున్నారా అన్న విషయాలపై తనీష్‌ను అధికారులు విచారించనున్నారని తెలుస్తోంది.
ఇపుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హవాల రూపంలో జరిగిన లావాదేవీలపై ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటోంది. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న నటీనటులకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తోంది. అందులో భాగంగా మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది.
Annie : రామ్ చరణ్ చెల్లెలిగా చేసిన అనీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
టాలీవుడ్‌కు చెందిన 12 మందికి నోటీసులు :
ఇప్పటికే ఇదే కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ప్రముఖ నటి, నిర్మాత (Charmi) ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet), నందు (Nandu), రవితేజ (Raviteja), రానా, నవదీప్ , ముమైత్ ఖాన్‌ల (Mumaith Khan)ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కెల్విన్‌తో వీరికి ఉన్న సంబంధాల పైన విచారణ జరిపారు అధికారులు. అలాగే వారి బ్యాక్ లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు.
Pawan Kalyan | Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి మరో సీన్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..
తనీష్‌ను ప్రశ్నించనున్న ఈడీ అధికారులు :
ఇక ఇదే కేసులో తాజాగా తనీష్ (Actor Tanish)ను ఈడీ అధికారుల ముందు హాజరు అయ్యారు. అందులో భాగంగా తనీష్ కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్ కోణంలో అధికారులు తనీష్ బ్యాంకు ఖాతాలను పరిశీలించనున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
ఈడీ ముందు ఈనెల 22న తరుణ్ :
డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో ఏమైనా పరిచయం ఉందా? తదతర అంశాలపై నటి తనీష్‌ను విచారించనున్నారు. ఇక ఇదిలా ఉండగా తనీష్ నటించిన 'మరో ప్రస్థానం' సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ప్రస్తుతం సరైన విజయాలు లేక సతమతమవుతోన్నతనీష్‌కు ఈ సినిమా ఏ మేరకు ఉపయోగపడుతోందో చూడాలి. ఇక ఇదే కేసులో ఈనెల 22న మరో నటుడు తరుణ్ (Actor Tharun)ను ఈడీ అధికారులు విచారించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.