ACTOR SURIYA IS BACK HOME ALL SAFE BROTHER KARTHI SHARES HEALTH UPDATE MNJ
Suriya- Karthi: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆరోగ్య పరిస్థితిపై కార్తీ ట్వీట్
సూర్య కార్తి
Suriya- Karthi: కరోనా సోకిన వారిలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. ఇటీవలే ఈయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సూర్య ఫిబ్రవరి 7న తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ''నాకు కరోనా సోకింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఇంకా సాధారణ పరిస్థితులు రాలేదని మాకు తెలిసొచ్చింది.
Suriya- Karthi: కరోనా సోకిన వారిలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. ఇటీవలే ఈయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సూర్య ఫిబ్రవరి 7న తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ''నాకు కరోనా సోకింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఇంకా సాధారణ పరిస్థితులు రాలేదని మాకు తెలిసొచ్చింది. అలా అని భయం అవసరం లేదు. అలాగే జాగ్రత్త చర్యలు మాత్రం కచ్చితంగా తీసుకోండి. ఎంతో నిబద్ధతతో పనిచేస్తోన్న వైద్యులకు థ్యాంక్స్ అని సూర్య ట్వీట్ పెట్టారు. ఇక సూర్యకు కరోనా సోకిందని తెలిసిన ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. తమ నటుడి ఆరోగ్యం ఎలా ఉందో'' అని తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సూర్య సోదరుడు కార్తీ తాజాగా ఓ ట్వీట్ చేశారు.
అన్న ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం ఆరోగ్యం బావుంది. మరికొన్ని రోజులు హోం క్వారంటైన్లో ఉంటారు. మీ అందరి ఆశీస్సులు, ప్రార్థనలకు థ్యాంక్స్ చెప్పడం చిన్న మాట అని కార్తీ ట్వీట్ చేశారు. దీంతో తమ నటుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకున్న సూర్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Anna is back home and all safe! Will be in home quarantine for a few days. Can’t thank you all enough for the prayers and best wishes!
కాగా గతేడాది సూరారై పొట్రుతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు సూర్య. కెప్టెన్ గోపినాథ్ జీవిత కథలోని అంశాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల అయినప్పటికీ మంచి విజయాన్ని సాధించింది. ఇక ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివసల్ అనే చిత్రంలో నటించనున్నారు సూర్య. దీంతో పాటు పాండిరాజ్‌తో ఓ చిత్రం, ఙ్ఞాన్వేల్తో మరో చిత్రం , వెంకట ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు ఈ విలక్షణ నటుడు.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.