విలన్‌గా మారిన కమెడియన్... మరోసారి కొత్తగా..

యాక్టర్ సునీల్ మొదట తన సినీ కెరీర్‌ను కమెడియన్‌గా ప్రారంభించి హాస్య పాత్రలతో  కొన్నాళ్లు అదరగొట్టాడు.

news18-telugu
Updated: December 29, 2019, 6:24 PM IST
విలన్‌గా మారిన కమెడియన్... మరోసారి కొత్తగా..
Twitter
  • Share this:
యాక్టర్ సునీల్ మొదట తన సినీ కెరీర్‌ను కమెడియన్‌గా ప్రారంభించి హాస్య పాత్రలతో  కొన్నాళ్లు అదరగొట్టాడు. కమెడియన్‌గా మంచి పేరు, తీరికలేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో హీరోగా మారాడు. ఆ తర్వాత హీరోగా  కొన్ని విజయాల్ని మరికొన్ని అపజయాల్నీ అందుకున్న సునీల్.. కొన్ని పరిస్థితుల మధ్య మళ్లీ హాస్య నటుడిగా మారాడు. ప్రస్తుతం కమెడియన్‌గా రాణిస్తున్న సునీల్ మరోసారి తన పంథాను మార్చుకున్నాడు. ఇన్నాళ్ళు హాస్యనటుడిగా, హీరోగా అలరించిన ఆయన విలన్‌గా కొత్త అవతారం ఎత్తుతున్నారు. నటుడు సుహాస్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో ‘కలర్ ఫోటో’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రేమ కథలో కమెడియన్ సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పానేని నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్  నాని చేతుల మీదుగా విడుదలైంది.

Published by: Suresh Rachamalla
First published: December 29, 2019, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading