ఆ సినిమా షూటింగ్‌లో హీరో వెంకటేశ్‌కి చెంపదెబ్బ..

సినిమాలో వెంకటేశ్‌ను చెంపదెబ్బ కొట్టే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పడు డైరెక్టర్ తనను నిజంగానే కొట్టమన్నాడని చెప్పారు.

news18-telugu
Updated: November 17, 2019, 6:51 PM IST
ఆ సినిమా షూటింగ్‌లో హీరో వెంకటేశ్‌కి చెంపదెబ్బ..
వెంకటేష్
  • Share this:
ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో విక్టరీ వెంకటేశ్. మిగతా హీరోల్లాగా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా వైవిధ్యమైన పాత్రల్లో ఆయన నటించి మెప్పించారు. సీనియర్ హీరో అయినప్పటికీ హీరోయిన్ డామినేషన్ ఉండే సినిమాలు సైతం ఆయన చేశారు. అలా చేసిందే 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమా. ఈ సినిమాకు సంబంధించి నటుడు శ్రీరామ్ ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమాలో వెంకటేశ్‌ను చెంపదెబ్బ కొట్టే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పడు డైరెక్టర్ తనను నిజంగానే కొట్టమన్నాడని చెప్పారు. అందుకు తాను అభ్యంతరం చెప్పానని.. సినిమా అంటే ఏదైనా నటన ద్వారానే చెప్పాలని,అంతే తప్ప ఇలా కొట్టడమేంటని ప్రశ్నించినట్టు చెప్పారు. కానీ దర్శకుడి ప్రతిపాదనకు హీరో వెంకటేశ్ కూడా ఓకె చెప్పాడని.. నిజంగానే చెంపదెబ్బ కొట్టాలని తానే స్వయంగా చెప్పారని తెలిపారు. దాంతో ఆ షూటింగ్‌లో వెంకటేశ్‌ను నిజంగానే చెంపదెబ్బ కొట్టానన్నారు. అలా ఆ షాట్ ఓకె అయ్యేందుకు మూడు,నాలుగుసార్లు చెంపదెబ్బ కొట్టినట్టు చెప్పారు. సీనియర్ హీరో అన్న ఇగో వెంకటేశ్‌లో అసలు ఉండదని.. సినిమా ఒప్పుకున్నారంటే నిబద్దతతో పనిచేస్తారని చెప్పుకొచ్చారు.
First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com