Sonu Sood Tests Covid Positive: సోనూ సూద్‌కు సోకిన కరోనా.. అందోళన వద్దంటూ ట్వీట్..

Sonu Sood Tests Covid Positive: సోనూ సూద్‌కు సోకిన కరోనా.. అందోళన వద్దంటూ ట్వీట్..

సోనూసూద్

Sonu Sood Tests Covid Positive: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి.

  • Share this:
    దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు చిన్నోడు పెద్దోడు అందరూ వణికిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలెబ్రీటీల వరకు అందరూ దీనికి సమానమే. ఇప్పటికే ఈ కరోనా కారణంగా పలువురు సినీ సెలెబ్రిటీస్ మరణించగా.. చాలా వరకు పాజిటివ్ వచ్చినా సరైనా చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్, నటుడు నిర్మాత బండ్ల గణేష్ దీని బారిన పడగా.. ఇక తాజాగా సినీ నటుడు సోనూ సూద్‌కు కూడా కరోనా సోకిందని తెలిసింది. దీనికి సంబంధించి ఆయన తన సోషల్ మీడియాలో తెలుపుతూ ఈరోజు మార్నింగ్ తనకు టెస్ట్ చేస్తే.. కరోనా సోకిందని అయితే ఆరోగ్యం బాగానే ఉందని తెలిపాడు. అంతేకాదు మీకు ఏ అవసరం ఉన్నా నేను ఉన్నాను అంటూ,  తన ఆరోగ్యం బాగానే ఉందని అందోళన చెందవద్దని ఆయన తన అభిమానులకు భరోసా ఇచ్చాడు. ఇక్కడ విశేషమేమంటే ఆయన కరోనా ఫస్ట్ డోస్ తీసుకున్నాడు. అయిన కూడా కరోనా సోకింది. ఇక కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ ప్రజలకు అండగా నిలిచి హీరో అయ్యాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులపాలైన సామాన్యులకు అండగా నిలిచి గొప్ప మనసున్న నటుడుగా గుర్తింపు పొందాడు సోనూ సూద్.

    లాక్ డౌన్ సమయంలో ముఖ్యంగా వలసకూలీలకు తోడుగా నిలిచి వారి తమ స్వస్థలాలకు చేర్చాడు సోనూ.. ఇక అప్పటినుండి ఆయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. ఇక అప్పటినుండి ఆయన అవసరమున్న వారికి నిరంతరం సహాయం చేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా సోనూ సూద్ చాలా మంది విద్యార్థులకు ఫీజు చెల్లించాడు. ఇంకోంత మందికి మెడిసిన్ ఖర్చులను భరించాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందడానికి సహాయపడ్డారు. ఇలా తనకు చేతనైనా సాయం చేస్తూనే ఉన్నాడు. దీంతో అతనికి సోషల్ మీడియాతో పాటు బయటకుడా విపరీతంగా ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో కలియుగ కర్ణుడు అని ఆయనను పిలుస్తున్నారు నెటిజన్స్.


    ఇక సోనూ సూద్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ఆచార్యలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ చరణ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సోనూ సూద్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఈ సినిమా మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు