Sonu Sood: చెప్పినట్లుగానే రైతు ఇంటికి ట్రాక్టర్ పంపిన సోనూ సూద్..

Sonu Sood: సోనూ సూద్ ఈ మధ్య కాలంలో అందరికీ హీరో అయిపోతున్నాడు. ఈయన చేస్తున్న పనులు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. విలన్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉంటారా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 26, 2020, 8:38 PM IST
Sonu Sood: చెప్పినట్లుగానే రైతు ఇంటికి ట్రాక్టర్ పంపిన సోనూ సూద్..
సోనూ సూద్ సాయం (sonu sood help)
  • Share this:
సోనూ సూద్ ఈ మధ్య కాలంలో అందరికీ హీరో అయిపోతున్నాడు. ఈయన చేస్తున్న పనులు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. విలన్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉంటారా అనుకునే వాళ్లకు ఇప్పుడు సోనూను చూపిస్తే సరిపోతుంది. ఈయనకు ఇప్పుడు అభిమానులు కాదు ఏకంగా భక్తులు వచ్చేస్తున్నారు. ఆ మధ్య కరోనా సమయంలో ఈయన చేసిన పనులు చూసి అందరూ ఈయనకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఆ తర్వాత కూడా కష్టం అనిపిస్తే చాలు వెంటనే వాళ్లకు సాయం చేస్తున్నాడు ఈయన.

సోనూ సూద్ సాయం (sonu sood help)
సోనూ సూద్ సాయం (sonu sood help)


తాజాగా ఇప్పుడు కూడా ఇదే చేసాడు సోనూ సూద్. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్ రాజపురం రైతు నాగేశ్వరరావు తన కూతుళ్లతోనే వ్యవసాయం చేస్తున్నాడు. పొలం దున్నడానికి ఎద్దులు కూడా లేకపోవడంతో కూతుళ్లనే ఎద్దులుగా వాడేస్తున్న వీడియో చూసి చలించిపోయాడు సోనూ సూద్. వెంటనే మీకు నేను సాయం చేస్తానంటూ ముందుకొచ్చాడు.

సాయంత్రానికి మీ యింట్లో ట్రాక్టర్ ఉంటుందని చెప్పాడు. అన్నట్లుగానే వాళ్ల యింటికి ట్రాక్టర్ పంపించాడు సోనూ సూద్. ఆ ఏరియాలోని సోనాలిక ట్రాక్టర్ ఏజెన్సీతో మాట్లాడి రైతు ఇంటికే నేరుగా ట్రాక్టర్ పంపించాడు ఈయన. రైతు నాగేశ్వరరావు కుమార్తెలతో జోడెద్దుల మాదిరిగా నాగలి పట్టించడం చూసి చలించిపోయిన సోను సూద్ ఈ సాయం చేసాడు.
Published by: Praveen Kumar Vadla
First published: July 26, 2020, 8:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading