హోమ్ /వార్తలు /సినిమా /

Siddharth: సమంతపై చేసిన ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చిన హీరో సిద్ధార్థ్

Siddharth: సమంతపై చేసిన ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చిన హీరో సిద్ధార్థ్

సమంత, సిద్ధార్థ్ (ఫైల్ ఫోటో)

సమంత, సిద్ధార్థ్ (ఫైల్ ఫోటో)

Siddharth: మోసం చేసిన వాళ్లు బాగుపడరు అంటూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్.. సమంత గురించే అని అంతా భావించారు.

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని విడిపోతున్నట్టు ప్రకటన వచ్చిన తరువాత కొందరు దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పందించారు. ఆ సమయంలో హీరో సిద్ధార్థ్ చేసిన ఓ ట్వీట్ కలకలం రేపింది. మోసం చేసిన వాళ్లు బాగుపడరు అంటూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్.. సమంత గురించే అని అంతా భావించారు. అయితే తాజాగా కొద్దిరోజుల క్రితం తాను చేసిన ఈ ట్వీట్ గురించి స్పందించాడు హీరో సిద్ధార్థ్.. తాను సమంతను ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని క్లారిటీ ఇవ్వలేదు. తన జీవితంలో జరిగిందే తాను ట్వీట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఆ ట్వీట్‌ను ఎవరో తన గురించి అనుకుంటే తాను ఏమీ చేయలేనని వ్యాఖ్యానించాడు. తన ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే... తాను దాని గురించి ట్వీట్ చేశానని.. దానికి ఎవరో బాధపడితే తనకు సంబంధం ఏంటి ? అని సిద్ధార్థ్ వ్యాఖ్యానించడం విశేషం.

“మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు..? ” అంటూ ట్వీట్ చేశారు.


గతంలో సిద్ధార్థ్, సమంతలు కలిసి నటించారు. అంతేకాదు ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లో ఓ రూమర్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ఈ ట్వీట్ చేసి ఉంటారని నెటిజన్స్ భావించారు. అయితే తాజాగా తాను చేసిన ట్వీట్‌పై రియాక్టయిన సిద్ధార్థ్.. ఆ ట్వీట్ సమంత గురించి కాదని క్లారిటీ ఇచ్చాడు.

Chiranjeevi: క్లైమాక్స్‌కు చేరుకుంటున్న మా ఎన్నికలు.. లాస్ట్ పంచ్ మెగాస్టార్‌దేనా.. ఆయన మాటలకు అర్థమేంటి ?

Fake Banking Apps: బ్యాంకింగ్ యాప్స్‌తో జరభద్రం.. ఫేక్ యాప్స్‌ను ఇలా గుర్తించండి..

మరోవైపు నాగచైతన్య నుంచి విడిపోయిన తరువాత తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై సమంత స్పందించింది. తన వ్యక్తగత సమస్య చూపిస్తున్న శ్రద్ధకి తాను ధన్యురాల్ని అంటూ కామెంట్ చేసింది. కొందరు వ్యాప్తి చేస్తున్న రూమర్స్. తప్పుడు కథనాలు తనను బాధిస్తున్నాయని వాపోయింది. తనకు అఫైర్స్ ఉన్నాయని, పిల్లలంటే ఇష్టం లేదని, అవకాశవాదినని, ఇంకా నేను అబార్షన్ చేయించుకున్నానని ఇలా రకరకాలుగా తన మీద దాడి చేస్తున్నారని.. ఇది పూర్తిగా అవాస్తవమని అన్నారు. విడాకులు తీసుకోవడం తనకు కూడా బాధగానే ఉందని పేర్కొంది. తనను దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనీయండని రిక్వెస్ట్ చేసింది.

First published:

Tags: Hero siddarth, Samantha Ruth Prabhu

ఉత్తమ కథలు