ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటుడు ఆనంద్ వీర్ సూర్య వంశీ అకస్మాత్తుగా చనిపోయాడు. సిద్ధాంత్ వీర్ సూర్యవంశీగా పాపులర్ అయిన అతడు... జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తూ కుప్పకూలాడు. ఆయన పలు షోల్లో నటించాడు. ష్... కోయీ హై, సూఫియానా మేరా ఇష్క్ హై అనే సీరియల్స్‌లో నటించారు. ఆయన వయసు 46 ఏళ్లు. సిద్ధాంత్‌కు పెళ్లూ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సిద్ధాంత్ భార్య సూపర్ మోడల్ అలేషియా రౌత్. సిద్ధాంత్ మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే ఇప్పటికే చాలామంది ఇలా జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తున్న సమయంలోనే గుండెపోటుకు గురై మృతి చెందారు. కన్నడ స్టార్ హీరో పునీత్ కూడా ఇలానే జిమ్‌లో వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో అడ్మిట్ అయి... చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఆ తర్వాత ఇటీవలే మరణించిన ప్రముఖ కమెడియన్ శ్రీవాస్తవ్ కూడా జిమ్‌లో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలారు. ఆ తర్వాత ఆయన కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో కోమాలో ఉంటూ చికిత్స తీసుకున్నారు, చివరకు మృతి చెందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.