శర్వానంద్‌‌కు 11 గంటల పాటు ఆపరేషన్..అంత సమయం ఎందుకంటే ?

శర్వానంద్ '96' సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టైన '96'కు రీమేక్.. ఈ సినిమా కోసం స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటున్నారు శర్వానంద్. శిక్షణ సమయంలో శ‌ర్వానంద్ భుజం, కాలికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు డాక్టర్స్ దాదాపు 11 గంటల పాటు ఆపరేషన్ చేశారంటున్నారు.

news18-telugu
Updated: June 18, 2019, 6:06 PM IST
శర్వానంద్‌‌కు 11 గంటల పాటు ఆపరేషన్..అంత సమయం ఎందుకంటే ?
శర్వానంద్, సాయి పల్లవి Photo: Twitter
news18-telugu
Updated: June 18, 2019, 6:06 PM IST
శ‌ర్వానంద్..మంచి కథలతో, కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ..తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయారు. శర్వానంద్, దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న '96' సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టైన '96'కు రీమేక్.. ఈ సినిమా కోసం స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటున్నారు శర్వా.  శిక్షణ సమయంలో శ‌ర్వానంద్ భుజం, కాలికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు భుజం భాగంలోని ఎముక డిస్‌లొకేట్ అయ్యిందని..దీనికి శస్త్ర చికిత్స చేశామన్నారు డా. గురవా రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ‌ర్వానంద్‌తో నాకు 15 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. మా కుటుంబ స‌భ్యుడిగా భావిస్తుంటాను. అయితే దుర‌దృష్టవశాత్తు థాయ్‌లాండ్‌లో జ‌రిగిన ప్రమాదంలో త‌న భుజం భాగంలోని ఎముక విరిగి ఐదారు ముక్కలైందని..దీంతో ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశామన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. మా టీమ్ నాలుగు గంట‌ల పాటు ఆపరేషన్ చేశామన్నారు. దీనికి తోడు ఐదు గంట‌ల పాటు ప్లాస్టిక్ స‌ర్జరీ చేశామని..శర్వానంద్ ఎముక ముక్కలవడంతో శస్త్ర చికిత్స నిర్వహించడానికి చాలా సమయం ప‌ట్టిందన్నారు...దీనికి తోడు ఆప‌రేష‌న్ త‌ర్వాత మూడు గంట‌ల పాటు అబ్జర్వేష‌న్‌లో ఉంచామని చెప్పారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం ఐదు గంట‌ల త‌ర్వాత ఐసీయూకి మార్చాం అన్నారు. అయితే కుడి భుజానికి గాయమవడంతో చెయ్యి మామూలు స్థితికి రావడానికి కొంత స‌మ‌యం ప‌డుతుందన్నారు.
First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...