టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ప్రస్తుతం చెన్నై లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శరత్ బాబు ఆరోగ్యం త్వరగా కుదురపడాలని కోరుకుంటున్నారు.
తాజాగా శరత్ బాబు ఆరోగ్యంపై కరాటే కళ్యాణి పోస్ట్ పెట్టింది. ‘నాకు ఇష్టమైన హీరో.. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు తొందరగా కోలుకోవాలని మనం స్వామిని వేడుకొందాం.. శ్రీ రామరక్ష’ అంటూ పోస్ట్ పెట్టింది కరాటే కళ్యాణి.
తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు శరత్ బాబు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శరత్ బాబు మూడు నంది అవార్డులు అందుకోవడం విశేషం. ఇక శరత్ బాబు, రమాప్రభ మధ్య ఇప్పటికి తేలని వివాదం ఉంది. ఇక శరత్ బాబు చివరగా వకీల్ సాబ్ చిత్రంలో నటించారు.
1973లో ‘రామరాజ్యం’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు శరత్ బాబు. ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన.. ప్రస్తుతం వయసు 72 సంవత్సరాలు. రమాప్రభ, స్నేహ నంబియార్ ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నారు. ప్రెసెంట్ చెన్నైలో నివాసముంటున్నారు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు.. తాజాగా శరత్ బాబు అనారోగ్యానికి గురయ్యారనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cinema, Tollywood, Tollywood actor