కారు ప్రమాదంలో గాయాల పాలైన బాలీవుడ్ నటి..

బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్ షబానా అజ్మీకి ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్గు‌కురైయింది. ముంబాయి, పూణే ఎక్స్ ‌ప్రెస్ హైవెేలోని కోల్హాపూర్‌లో ఈ యాక్సిడెంట్ జరిగింది.

news18-telugu
Updated: January 18, 2020, 6:21 PM IST
కారు ప్రమాదంలో గాయాల పాలైన బాలీవుడ్ నటి..
కారు ప్రమాదంలో గాయపడ్డ బాలీవుడ్ నటి షబానా అజ్మీ (Twitter/Photo)
  • Share this:
ప్రముఖ బాలీవుడ్ నటి ఒకప్పటి హీరోయిన్ షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైయింది. ముంబాయి, పూణే ఎక్స్ ‌ప్రెస్ హైవెేలోని కహల్‌పూర్‌లో ఈ యాక్సిడెంట్ జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు ట్రక్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షబానా అజ్మీ‌తో ఆమె కారు డ్రైవర్‌కు  తీవ్ర గాయాలయ్యాయి. ఇదే కారులో ప్రయాణిస్తున్న ఆమె భర్త జావేద్ అఖ్తర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వెంటనే షబానా అజ్మీతో పాటు ఆమె కారు డ్రైవర్‌ను సమీపంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ల పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. షబానా అజ్మీ విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ఆర్ట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఇప్పటి వరకు ఉత్తమ నటిగా ఐదు జాతీయ చలన చిత్ర పురస్కారాలను అందుకొని రికార్డులు క్రియేట్ చేసింది. ఆమె భర్త జావేద్ అఖ్తర్ ప్రముఖ బాలీవుడ్ రచయత. అప్పట్టో ఆయన ‘షోలే’, ‘జంజీర్’ వంటి సినిమాలకు సలీమ్ ఖాన్‌తో కలిసి రచనలు చేసాడు. షబానా  తండ్రి కైఫ్ అజ్మీకి బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు మాటలతో పాటు పాటలను రాసారు. షబానా అజ్మీ స్వస్థలం హైదరాబాద్. ప్రముఖ నటి టబుకు షబానా అజ్మీ స్వయాన మేనత్త. ఈమె మరో మేనకోడలు ఫర్హా కూడా హీరోయినే.

గాయాల పాలైన షబానా అజ్మీ (Twitter/Photo)


అంతేకాదు ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు ఫర్హాన్ అఖ్తర్‌కు ఈమె సవతి తల్లి. ఈమె రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ రావు హీరోగా నటించిన ‘మార్నింగ్ రాగా’ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించింది. షబానా అజ్మీకి యాక్సిడెంట్ విషయం తెలిసి పలువురు ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. అంతేకాదు వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.


First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు