Home /News /movies /

ACTOR SATYADEV KRISHNAMMA FIRST LOOK RELEASE SLB

Satyadev: యాక్టర్ సత్యదేవ్ బర్త్ డే ట్రీట్.. కృష్ణమ్మ ఫస్ట్ లుక్ విడుదల

Photo Twitter

Photo Twitter

Actor Satyadev: ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో యాక్టర్ సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వర్సటైల్ హీరో సత్యదేవ్ (Satyadev) పుట్టినరోజు (జూలై 4). ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా కృష్ణమ్మ (Krishnamma) పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీవీ గోపాల కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. నేటితరం ఆడియన్స్ కోరుకునే డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం నాడు చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఇక ఇందులో సత్యదేవ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ఆ కత్తి పట్టుకుని స‌త్య‌దేవ్ నిలుచుకున్నారు. మంచి, చెడుల కలయిక నది నడత... పగ, ప్రేమ కలయిక మనిషి నడక అనే ఓ భావం ఎలివేట్ అవుతుంది.

కృష్ణమ్మ అనే టైటిల్ కూడా ఎంతో పవర్ ఫుల్‌గా అనిపిస్తోంది. ఇక ఈ యాక్షన్ మూవీకి సన్నీ కూరపాటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. కాళ భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రంలో సత్యదేవ్, లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Satyadev, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు