Home /News /movies /

ACTOR SATYADEV COMMENTS ON CHIRANJEEVI GOES VIRAL ON SOCIAL MEDIA SR

Chiranjeevi | Satyadev : చిరంజీవి ప్రవర్తనపై సత్యదేవ్ కీలక కామెంట్స్.. ట్వీట్ వైరల్..

Chiranjeevi and Satya dev Photo : Twitter

Chiranjeevi and Satya dev Photo : Twitter

Chiranjeevi | Satyadev : 'ఆచార్య' (Acharya) రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో హీరో స‌త్య‌దేవ్ (Satyadev), సోషల్ మీడియా వేదికగా చిరంజీవి (Chiranjeevi) గురించి ఆస‌క్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఆచార్య' (Acharya) రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో హీరో స‌త్య‌దేవ్ (Satyadev), సోషల్ మీడియా వేదికగా చిరంజీవి (Chiranjeevi) గురించి ఆస‌క్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. సత్యదేవ్  (Satyadev) తన ట్వీట్‌లో రాస్తూ.. ''అన్నయ్యా.. నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈ రోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది'' అని స‌త్యదేవ్ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌పై స్పందించిన చిరంజీవి.. ''డియర్ సత్య‌దేవ్ కృత‌జ్ఞ‌త‌లు. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం. ఆచార్య‌లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం. గాడ్ ఫాద‌ర్ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం'' అని ఆయన తన రిప్లే ట్వీట్‌లో పేర్కోన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక ఆచార్య విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి  నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలవుతోంది.  ఏప్రిల్ 12న ఈ సినిమాకు సంబంధించిన (Acharya Trailer) ట్రైలర్‌ను విడుదల చేసింది టీమ్. ఈట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ ఆచార్య రికార్డు క్రికెట్ చేసింది. 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఆధ్యాత్మికంకు నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

  ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌‌ (Acharya Prerelease Event) ఏప్రిల్ 23న ఆరు గంటలకు హైదరాబాద్‌లోని యూసఫ్ గూడలో నిర్వహించింది టీమ్. ఈ కార్యక్రమానికి దిగ్గజ దర్శకడు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసింది టీమ్. భలే భలే బంజారా సాంగ్జ‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. చిరంజీవి, రామ్ చరణ్‌లు ఇద్దరూ ఈ పాటలో కలిసి డాన్స్ ఇరగదీశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు.


  రామ్ చరణ్ (Ram Charan)  సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటించగా ఆ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది.

  Happy Birthday Samantha Ruth Prabhu : తన టీమ్‌తో కలిసి కశ్మీర్‌లో సమంత బర్త్ డే వేడుకలు.. పిక్స్ వైరల్..

  ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి తాజాగా మరో సినిమాకు ఓకే అన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. మలయాళంలో మోహన్‌ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్‌ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Acharya, Chiranjeevi, Ram Charan, Satyadev

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు