Home /News /movies /

ACTOR SATHISH VAJRA DEATH MISTORY VIRAL SLB

బావమరిది చేతిలో యూట్యూబ్ స్టార్ హత్య.. అక్క మరణమే కారణం?

Photo Twitter

Photo Twitter

Sathish Vajra Death: వేగంగా వ్యాప్తి చెందుతున్న టెక్నాలజీని చూసి సంతోషించాలో లేక పగ, ప్రతీకారం అంటూ హత్యలు చేసుకుంటున్న జనాన్ని చూసి చింతించాలో తెలియని పరిస్థితులు నెలకొంటున్నారు. తాజాగా సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ఓ వ్య‌క్తి హత్య ఇందుకు మచ్చుతునక అయింది.

ఇంకా చదవండి ...
కాలం మారింది.. ఇది కలికాలం అంటుంటారు పెద్దలు. కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే వాళ్ళు చెప్పేది అక్షరాలా నిజం అనిపిస్తుంది. ప్రపంచమంతటా ఓ పక్క అక్షరాస్యత పెరుగుతూ పోతున్నా కూడా జనాల మైండ్ సెట్ మాత్రం చాలా క్రూరంగా మారుతూ వస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న టెక్నాలజీని చూసి సంతోషించాలో లేక పగ, ప్రతీకారం అంటూ హత్యలు చేసుకుంటున్న జనాన్ని చూసి చింతించాలో తెలియని పరిస్థితులు నెలకొంటున్నారు. తాజాగా సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ఓ వ్య‌క్తి హత్య ఇందుకు మచ్చుతునక అయింది. బెంగుళూరులో ఓ నటుడు హత్య చేయబడ్డాడు. స్వయానా బావమరిదే ఆయన్ను హతమార్చడం ఇక్కడ అసలు విషయం.

సినీ ఇండస్ట్రీకి చెందిన స‌తీష్ వ‌జ్ర (Satish Vajra) అనే నటుడిని కొంద‌రు దుండ‌గులు ఆయ‌న ఇంట్లోకి ప్ర‌వేశించి మార‌ణాయుధాల‌తో దాడి చేసి చంపేశారు. బెంగుళూరులో శుక్ర‌వారం రోజు రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం స‌తీష్ వ‌జ్ర వయస్సు 36 సంవత్సరాలే. మూడు నెలల క్రితమే సతీష్ భార్య ఆత్మహత్య చేసుకొంది. దీంతో బావపై బావమరిది అటాక్ చేశాడని తెలుస్తోంది.

తన అక్క చావుకు బావనే కారణమని భావించి ప్రతీకారం తీర్చుకున్నాడని అంటున్నారు. దాని ఫలితమే బావ మరణం. అత్యంత దారుణంగా సతీష్ హత్య చేయబడ్డాడు. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బెంగళూరులోనే నివాసం ఉంటూ టీవీ, యూట్యూబ్‌ చానెళ్లలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు సతీష్ వజ్ర. క‌ర్ణాట‌క‌లోని మాండ్య జిల్లాలోని మ‌ద్దూరుకి చెందిన ఈయన. రీసెంట్‌గానే ల‌గోరి అనే చిన్న చిత్రంలోనూ స‌తీష్ వ‌జ్ర నటించాడు.

అక్క అకాల మరణానికి ప్రతీకారంగా భార్య తమ్ముడే హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. రాజరాజేశ్వరినగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అసలు హంతకుడు బావమరిదేనా..? లేక వేరెవరైనా హత్య చేశారా అనేది.
Published by:Sunil Boddula
First published:

Tags: Kollywood, Kollywood News, Tollywood

తదుపరి వార్తలు