news18-telugu
Updated: September 23, 2019, 10:11 PM IST
ప్రతీకాత్మకచిత్రం
బాలివుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ హిందీలో బిగ్‌బాస్ 13 సీజన్ కోసం ముస్తాబవుతున్నాడు. ఇందులో భాగంగా ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించగా, అక్కడ ఓ ఫోటోగ్రాఫర్ పై సల్మాన్ ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా సర్క్యూలేట్ అవుతోంది. షో ఓపెనింగ్ లో భాగంగా ఓ ఫోటోగ్రాఫర్ సల్మాన్ కు చిరాకు తెప్పించడంతో, ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు నీకు ప్రాబ్లం ఉంటే చెప్పు, నన్ను వీలైతే బ్యాన్ చేసేయ్ అంటూ సల్మాన్ ఫైర్ అయ్యాడు. ఇంతలోనే నిర్వాహకులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే హిందీలో బిగ్ బాస్ 13వ సీజన్ ప్రారంభమవుతోంది. గడిచిన 12 సీజన్ల కన్నా భిన్నంగా ఈ సీజన్ ఉండనుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

సల్మాన్ ఖాన్
Published by:
Krishna Adithya
First published:
September 23, 2019, 10:11 PM IST