ACTOR SAI KIRAN FILE POLICE COMPLAINT AFTER CHEATED BY PRODUCERS SB
Cheating: అడ్డంగా మోసపోయిన నువ్వే కావలి సినిమా హీరో.. పోలీసులకు ఫిర్యాదు
సాయికిరణ్
కృష్ణుడిగా, వేంకటేశ్వరుడిగా కూడా కనిపించాడు. సాయికిరణ్ హీరోగా, సీరియల్ నటుడిగానే కాకుండానే హైదరాబాద్ బ్లూక్రాస్ సంస్థలో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు.
నువ్వే కావాలి సినిమా ఫేమ్ సాయి కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. నువ్వే కావాలి సినిమాతో ఆయన వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన పలు తెలుగు టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తున్నాడు. అయితే తాజాగా సాయి కిరణ్ తాను మోసపోయినట్లు పోలీసులను ఆశ్రయించాడు. నిర్మాత నిర్మాత జాన్ బాబు , లివింగ్ స్టెన్లపూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మన్న మినిస్ట్రీస్ లో సభ్యత్వం పేరుతో సాయి కిరణ్ దగ్గర నుంచి వారు 10.6 లక్షలు వసూలు.. చేసినట్లు తెలుస్తోంది.
అయితే డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులను సాయి కిరణ్..ఆశ్రయించాడు. దీంతో సాయి కిరణ్ ఫిర్యాదుతో జాన్ బాబు, లివింగ్ స్టెన్ లపై 420,406 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. కేసు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక సాయికిరణ్ ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడైన రామకృష్ణ కుమారుడు. ఈటీవీలో ప్రసారమైన శివలీలలు ధారావాహికలో విష్ణువుగా నటించాడు. తరువాత మరికొన్ని ఆధ్యాత్మిక ధారావాహికల్లో కృష్ణుడిగా, వేంకటేశ్వరుడిగా కూడా కనిపించాడు. సాయికిరణ్ హీరోగా, సీరియల్ నటుడిగానే కాకుండానే హైదరాబాద్ బ్లూక్రాస్ సంస్థలో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇంకా కొన్ని ఆధ్యాత్మిక సంస్థలలో కూడా సభ్యుడు. శివుడిపై శ్రీవత్సన్ అనే ఆల్బమ్ ను కూడా రూపొందించాడు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.