Sai Dharam Tej Health Condition: సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్ విడుదల..

సాయి ధరమ్ తేజ్ Photo : Twitter

Sai Dharam Tej Health Condition: నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై లేటె‌స్ట్‌గా హెల్త్ బులెటిన్ విడుదలైంది.

 • Share this:
  నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్‌ (Sai Dharam Tej Health Bulletin )ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం (Sai Dharam Tej Health Condition) నిలకడగా ఉందని, ఆయన శరీరంలో అన్ని ప్రధాన అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. తదుపరి హెల్త్ బులెటిన్ రేపు విడుదల చేస్తామని తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అందోళన చెందుతున్న అభిమానులకు కొంత ఉపశమనం కలిగించింది. ఇక సాయి తేజ్‌బైక్ యాక్సిడెంట్ విషయానికి వస్తే.. బైక్‌ రైడింగ్‌ అంటే ఆసక్తి. దీంతో ఎప్పటిలాగే.. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌ నడుపుతూ ఒక్కసారిగా బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన కుడికంటిపై భాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. అంతర్గతంగా గాయాలేవీ లేవని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

  ఇక అది అలా ఉంటే అసలు సాయి తేజ్ ప్రమాదానికి గురి కావాడానికి కారణం ఏంటీ.. ఆయన వాడిన బైక్ ఏంటీ.. ఆ బైక్ ధర ఎంత ఉండోచ్చని నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. సాయి తేజ్ బండి స్కిడ్ కావ‌డానికి కార‌ణం అక్క‌డ అక్కడ మట్టి, బురద ఉండటం అని అంటున్నారు. ఇక ఆయన బండి విషయానికి వస్తే.. బైక్ రైడింగ్ అంటే ఇష్టపడే.. తేజ్ ఈ బైక్‌ని రీసెంట్‌గా హైదరాబాద్‌లో కొనుగోలు చేశారు. TS07 GJ1258 ఇది ఆ బైక్ రిజిష్ట్రేషన్ నంబర్. ఆయన వాడిన బైక్ పేరు ట్రయంప్ ట్రైడెంట్‌గా తెలుస్తోంది. ఆ బైక్ ఖరీదు రూ. ఏడు లక్షలుగా ఉంది. ఈ స్పోర్ట్స్ బైక్ 660 సీసీ ఇంజన్‌ను కలిగి ఉన్న హై ఎండ్ బైక్. దీని బ‌రువు దాదాపు 189 కేజీల వ‌ర‌కు ఉంటుంది.


  సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళనను తగ్గించేలా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిన్న సాయంత్రం కీలక ప్రకటన చేశారు. సాయిధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడని అపోలో ఆస్పత్రి ముందు మీడియాకు వెల్లడించారు. తలకు, శరీరంలో తీవ్ర గాయాలేమీ లేవని ఆయన ప్రకటించారు. రేపు ఉదయం సాధారణ వార్డుకు తరలించేలా ఆయన పరిస్థితి మెరుగవుతుందని వైద్యులు తనకు చెప్పారని అల్లు అరవింద్ చెప్పారు.

  శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో హీరో సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్‌ బైక్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్‌ తేజ్‌ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెల్మెట్ ఉన్నప్పటికీ సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు అయినట్టుగా వార్తలు వచ్చాయి.

  మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం సాయిధరమ్ తేజ్‌ను జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లి సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు. అనంతరం చిరంజీవి అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీలోని సభ్యులంతా ఆస్పత్రికి చేరుకుని సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు మెగా అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు.

  ఇక మరోవైపు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఘటనపై మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బైక్‌ను నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published: