సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా నటించిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం నవంబర్ 18న విడుదలై సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ గాలోడు టీం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిపాత్ర చేసిన రవిరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లుగా... ఒకే ఒక్క సినిమా "కెరీర్"ను మార్చేస్తుంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. అలాంటి సినిమా కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తనకు "గాలోడు" రూపంలో ఓ ఘన విజయం లభించిందని అంటున్నారు అమెరికా రిటర్నడ్ బిజినెస్ మేన్ రవిరెడ్డి. "గాలోడు" సాధిస్తున్న అసాధారణ విజయం తనను గాల్లో విహరించేలా చేస్తున్నదని చెబుతున్నారు.
"ఇంటిలిజెంట్, దర్పణం, దొరసాని, డిగ్రీ కాలేజ్, వి, విరాటపర్వం, సాప్ట్వేర్ సుధీర్" తదితర చిత్రాలతో నటుడిగా ఇప్పటికే తన సత్తాను ఘనంగా చాటుకున్న రవిరెడ్డి... "గాలోడు" చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో సముచిత పాత్ర పోషిస్తూ... అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేయడంతోపాటు... ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని, అక్కడ మోడలింగ్ సైతం చేసిన రవిరెడ్డి ఇప్పుడు టాలీవుడ్ లో పూర్తి స్థాయిలో నటనపై దృష్టి సారిస్తున్నారు.
"గాలోడు" చిత్రంలో హీరోయిన్ ఫాదర్ గా నటనకు ఆస్కారమున్న ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చి... "స్టైలిష్ అండ్ హ్యండ్సమ్ ఫాదర్ రోల్"తో తన నట జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకనిర్మాత "రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల"కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నారు రవి రెడ్డి. ఇక గాలోడు సినిమా విషయానికి వస్తే.. సుధీర్ హీరోగా ఇందులో నటించిన విషయం తెలిసిందే. గాలోడు కథ తనకు చాలా నచ్చిందని.. తన పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా బాగుంటుందన్నాడు సుధీర్. అందుకే సినిమాను ఒప్పుకున్నానని సుధీర్ తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sudigali sudheer