హోమ్ /వార్తలు /సినిమా /

ఈ సినిమా పోతే.. మళ్లీ మీకు కనపడను.. ప్రముఖ నటుడు కీలక వ్యాఖ్యలు

ఈ సినిమా పోతే.. మళ్లీ మీకు కనపడను.. ప్రముఖ నటుడు కీలక వ్యాఖ్యలు

Rajendra prasad Photo :Twitter

Rajendra prasad Photo :Twitter

ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు మరోసారి తమ కామెడీ టైమింగ్, పంచులతో ఎఫ్3 సినిమాను కూడా అదే స్థాయిలో పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రెడీ చేశారు.

టాలీవుడ్‌లో ప్రస్తుతం అంతా ఎఫ్3 కోసమే వెయిటింగ్. ఇప్పటివరకు ఎదురు చూసిన అన్నీ సినిమాలు వచ్చేశాయి. ఇక ఇప్పుడు ఎఫ్‌3 వంతు. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుంది... అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎఫ్‌2కు సీక్వెల్ మూవీ ‘ఎఫ్3’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కావడంతో, ఈ సీక్వెల్ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఎఫ్2 సినిమాలో నటిస్తున్న నటీనటులు మరోసారి తమ కామెడీ టైమింగ్, పంచులతో ఎఫ్3 సినిమాను కూడా అదే స్థాయిలో పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రెడీ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. ఈసారి సునీల్,రాజేంద్ర ప్రసాద్,ఆలీ వంటి ప్రముఖ హాస్యనటులు కూడా ఉండటం విశేషంజ

అయితే తాజాగా శనివారం.. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎఫ్3 ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్,హీరోయిన్ మెహ్రీన్,సోనాలి చౌహాన్,డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో అలీ, రాజేంద్ర ప్రసాద్ కూడా సందడి చేశారు.ఎఫ్3లో ఓ ముఖ్య పాత్ర పోషించి అందర్నీ నవ్వించనున్నారు రాజేంద్రప్రసాద్. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మనం ఉన్న పరిస్థితులకు.. సమాజానికి F3 మూవీ ఎంతో అవసరం. భయంకరమైన వేడిలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు నవ్వుల పంచే సినిమా ఎఫ్3. ప్రతి మనిషికి నవ్వు అవసరం, ఆ నవ్వులు పంచే సినిమా F3. అందరి జీవితాల్లో సమస్యలు ఉంటాయి. సీఎం నుంచి సామాన్యుడివరకు అందరికీ

సమస్యలు ఉంటాయన్నారు.

వాటన్నింటికి పరిష్కారం నవ్వు. నేను 40 ఏళ్లుగా నవ్వును నమ్ముకొని ఉన్నాను. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను అద్భుతంగా తీశారన్నారు రాజేంద్రప్రసాద్. ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ హైలెట్ అయిపోతాయన్నారు. అనిల్ రావిపూడి అద్భుతంగా సినిమా తీశారన్నారు. ఈ మూవీ హిట్ కాకపోతే గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా మళ్లీ మీ ముందు నేను ఎప్పుడూ నిలబడను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్. మీకు మళ్ళీ కనపడను... ఈ సినిమా మీద అంత నమ్మకం ఉందన్నారాయన. ఈ సినిమాలో అన్ని పాత్రలు 100 శాతం ప్రేక్షకులను నవ్విస్తాయి. F3 సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా” అని చెప్పుకొచ్చారు.

First published:

Tags: Anil Ravipudi, F3 Movie, Rajendra Prasad, Tollywood

ఉత్తమ కథలు