• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • ACTOR RAJENDRA PRASAD GETS EMOTIONAL IN SUMA CASH SHOW GALI SAMPATH TEAM MNJ

Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ సడన్‌గా ఇలా ఎమోషనల్ అయ్యారేంటి..?

రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad/Instagram)

Rajendra Prasad: తెలుగు ఇండస్ట్రీలో నాటి నుంచి నేటి వరకూ ఎంతో మంది కమెడియన్లు వచ్చినా నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ స్టయిలే వేరు. ఆయన్ను ఏదైనా సినిమాలో ఏదైనా పాత్రలో తీసుకున్నారంటే చాలు.. కావాల్సినంత కామెడీతో కడుపుబ్బా నవ్వించేస్తుంటారు. నాటి నటుల నుంచి నేటి వరకూ హీరోగా, కమెడియన్‌గా ఇలా అన్ని పాత్రల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆనందింపజేస్తుంటూ వస్తున్నారు.

  • Share this:
    Rajendra Prasad: తెలుగు ఇండస్ట్రీలో నాటి నుంచి నేటి వరకూ ఎంతో మంది కమెడియన్లు వచ్చినా నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ స్టయిలే వేరు. ఆయన్ను ఏదైనా సినిమాలో ఏదైనా పాత్రలో తీసుకున్నారంటే చాలు.. కావాల్సినంత కామెడీతో కడుపుబ్బా నవ్వించేస్తుంటారు. నాటి నటుల నుంచి నేటి వరకూ హీరోగా, కమెడియన్‌గా ఇలా అన్ని పాత్రల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆనందింపజేస్తుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘గాలి సంపత్’. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మధ్య ఎందుకో తాను తెరకెక్కించే దాదాపు అన్ని సినిమాల్లోనూ అడిగి మరీ రాజేంద్రప్రసాద్‌ను అనిల్ పెట్టుకుంటున్నాడు. మొన్న ‘సరిలేరు నీకెవ్వరు’.. ఇప్పుడు ‘గాలి సంపత్’ రేపొద్దున కూడా తీయబోయే సినిమాల్లో కూడా అవకాశమిస్తారేమో.

    ఇక అసలు విషయానికొస్తే.. ‘గాలి సంపత్’ సినిమా మంచి హిట్ టాకే తెచ్చుకుంది. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు రాజేంద్ర ప్రసాద్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయ్. ఆయన నటన కూడా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గానే అయ్యింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్’ ప్రోగ్రామ్‌కు ఎంతో ఉత్సాహంగా వచ్చిన రాజేంద్ర ప్రసాద్, అనిల్ రావిపూడి, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్.. యాంకర్ సుమ కనకాలతో పాటు షోకు వచ్చిన ప్రేక్షకులంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. అప్పటి వరకూ ఉత్సాహంగా ‘ఫ.. ఫీ.. ఫ’ అంటూ ఆట ఆడిన యూనిట్ అంతా సడన్‌గా ఎమోషన్ అవ్వడంతో అసలేం జరిగింది..? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఈ ప్రోమోను చూడసాగారు.


    అయితే సస్పెన్స్ కోసం ఈ ఎమోషనల్ సీన్లను ప్రోమోలో చూపించలేదు. ఆయనతో పాటు సినిమా యూనిట్, షో యూనిట్ అంతా ఒక్కసారిగా ఇలా ఎమోషనల్ అవుతూ.. ముఖ్యంగా సుమ అయితే కంటతడే పెట్టేశారు. షోలో ఏమైనా జరిగిందా..? లేకుంటే రాజేంద్రుడు పాత రోజులేమైనా గుర్తుకు తెచ్చుకుని ఇలా ఎమోషనల్ అయ్యారా..? అనేది మాత్రం తెలియరాలేదు. ఈ మధ్య ఆయన తనను నమ్మిన వాళ్లే నట్టేట ముంచేశారని బాగా ఎమోషనల్ అయ్యారు. ఆ సందర్భమే ఈ షోలో కూడా ప్రస్తావనకు రావడంతో ఆయనిలా ఎమోషనల్ అయ్యారా..? లేకుంటే ఇంకేమైనా కొత్త విషయముందా..? అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

    రాజేంద్రుడు ఇలా ఎమోషనల్ అవ్వడంతో ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు, ఆయన అభిమానులు కూడా బాగా ఫీలవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఎప్పుడూ మమ్మల్ని నవ్వించే మీరు ఇలా కంటతడి పెడితే.. మాకు చాలా బాదగా ఉంది రాజేంద్రప్రసాద్ గారు’ అని కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ‘మహానటి అంటే సావిత్రి గారు గుర్తొస్తారు.. మహానటుడు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తొస్తారు’ లవ్ యూ సార్ అని అంటున్నారు. ఇంకొందరైతే లెజండరీ సింగర్ బాలసుబ్రమణ్యంను రాజేంద్రప్రసాద్ గుర్తుకు తెచ్చుకుని ఇలా ఎమోషనల్ అవ్వడంతో అందరూ అలా రియాక్టరయ్యాంటూ కామెంట్స్ చేసేస్తున్నారు. అసలు విషయమేంటో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్‌ వచ్చేంతవరకూ.. లేదా టీవీలో చూస్తేనే అర్థమవుతుంది మరి.
    Published by:Manjula S
    First published: