హోమ్ /వార్తలు /సినిమా /

ఇక నా కూతురు హీరోయిన్‌.. ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన 30 ఇయర్స్ పృథ్వీ

ఇక నా కూతురు హీరోయిన్‌.. ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన 30 ఇయర్స్ పృథ్వీ

News 18 Telugu

News 18 Telugu

Prudhvi Raj Daughter: ఈ మధ్యకాలంలో నిర్మాతలు, దర్శకుల వారసులతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల బిడ్డలు కూడా సినీ గడప తొక్కుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు, ఇండస్ట్రీలో 30 ఇయర్స్ పృథ్వీగా (30 Years Prudhvi) ఫుల్ ఫేమస్ అయిన కమెడియన్ పృథ్వీ నట వారసురాలు సినీ రంగ ప్రవేశం చేయబోతోందట.

ఇంకా చదవండి ...

సినిమా ఇండస్ట్రీలో వారసుల రాక అనేది తరుచుగా జరిగేదే. అన్ని భాషా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల వారసత్వం ఎక్కువగా కొనసాగుతుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో నిర్మాతలు, దర్శకుల వారసులతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల బిడ్డలు కూడా సినీ గడప తొక్కుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు, ఇండస్ట్రీలో 30 ఇయర్స్ పృథ్వీగా (30 Years Prudhvi) ఫుల్ ఫేమస్ అయిన కమెడియన్ పృథ్వీ నట వారసురాలు సినీ రంగ ప్రవేశం (Cine Entry) చేయబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీ (Prudhvi Raj) వెల్లడించారు. తన కూతురు శ్రీలు (Sreelu) హీరోయిన్‌గా పరిచయం కాబోతోందని చెబుతూ ఆమె ఫస్ట్ మూవీకి (First Movie) సంబంధించిన వివరాలు వెల్లడించారు.

''మా అమ్మాయి శ్రీలు హోటల్ మేనేజ్‌మెంట్ చేసి మలేసియా వెళ్లి సెటిల్ కావాలని అనుకుంది. కానీ ఇంతలో డాన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్రావీణ్యం పొందింది. నటనపై మక్కువతో పలు సీన్స్ చూసి అనుకరించేది. నిజానికి మా అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేద్దామని ఎప్పుడో అనుకున్నాము కానీ కుదరలేదు. చివరికి నా స్నేహితుడు కుమారుడు క్రాంతి హీరోగా ముగ్గురు పాట్నర్స్ కలిసి మా అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టి ఓ సినిమా నిర్మించారు. ఒక టీమ్ వర్క్‌గా కథ రాసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సీనియర్ రైటర్ ఘటికాచలం గారు ఈ సినిమాకు బాగా హెల్ప్ చేశారు. అమ్మాయి, అబ్బాయి ప్రతిభ చూశాక నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను తీశారు. పాటలు అన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి. సంగీత్ ఆదిత్య గారు మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా సాంగ్స్ విడుదల చెయ్యబోతున్నాము. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియ జేస్తాము.

శ్రీ పిఆర్ క్రియేషన్స్ ద్వారా ఈ కొత్త రంగుల ప్రపంచం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తన ప్రతిభతో అద్భుతంగా తెరకెక్కిస్తున్న దర్శకుడికి నా కృతజ్ఞతలు. అతను రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమాను తీస్తున్నారు. త్వరలో ఆయన పేరు, వివరాలు మీకు తెలుపుతాను'' అని పృథ్వి అన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఫేమసైన పృథ్వీ రాజ్.. ఆ తర్వాత 30 ఇయర్స్ పృథ్వీగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి శ్రీలుని మన ముందుకు తీసుకొస్తున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: 30 Years Prudhvi Raj, Prudhvi Raj, Tollywood

ఉత్తమ కథలు