Home /News /movies /

ACTOR PRIYADARSHI SHOCKING COMMENT ON SUDIGALI SUDHEER IN SRIDEVI DRAMA COMPANY NR

Sudigali Sudheer: స్టేజిపైనే సుడిగాలి సుధీర్‌ని తిట్టిన ప్రియదర్శి.. ఏకంగా ఆ ఒక్క మాటతో!

sudigali sudheer

sudigali sudheer

Sudigali Sudheer: బుల్లితెర స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి, తన కామెడీ టైమింగ్స్ గురించి అందరికీ తెలిసిందే. ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో అడుగు పెట్టి తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

    Sudigali Sudheer: బుల్లితెర స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి, తన కామెడీ టైమింగ్స్ గురించి అందరికీ తెలిసిందే. ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో అడుగు పెట్టి తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు సుధీర్.

    ఈటీవీ ప్లస్ లో పోవే పోరా షోలో యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా డీ డాన్స్ షో లో టీమ్ లీడర్ గా చేస్తూ.. మరో టీమ్ లీడర్ రష్మీ తో బాగా సందడి చేస్తుంటాడు. ఇక వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు. ప్రస్తుతం బుల్లితెరలో మరో షోలో యాంకరింగ్ చేస్తూ బాగా బిజీగా మారాడు సుధీర్. ఇదిలా ఉంటే వేదికపైనే ఓ సినీ నటుడు సుధీర్ ను ఓ మాటతో తిట్టి షాక్ అయ్యేలా చేశాడు.

    ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ లను అందించడమే కాకుండా స్పెషల్ గెస్ట్ లతో బాగా సందడి చేస్తుంటారు. ఇక ఇందులో సుధీర్ యాంకరింగ్ చేస్తూ బాగా కామెడీ ట్రోల్స్ ఎదుర్కొంటాడు. తాజాగా వచ్చేవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.



    అందులో స్నేహమేరా జీవితం అనే టైటిల్ లో ప్రసారం చేయగా.. బుల్లితెర సెలబ్రెటీలు, సినీ నటులు పాల్గొని బాగా రచ్చ చేశారు. ఇక సిని నటుడు, కమెడియన్ ప్రియదర్శి గెస్ట్ గా వచ్చాడు. ఎంట్రీ తోని బాగా రచ్చ చేశాడు. ఇక సుడిగాలి సుధీర్.. 'నా చావు నేను చస్తా.. నీకెందుకు అని' ఓ పుస్తకం రాశారు కదా.. దాని పరిస్థితి ఏంటి.. దాన్ని పబ్లిష్ చేస్తున్నారా.. అని ప్రశ్నించడంతో.. వెంటనే ప్రియదర్శి.. 'నీకెందుకు బే హౌలే'.. అనే వాళ్లు ఆ బుక్కుని పబ్లిక్ చేస్తున్నారు అంటూ షాక్ ఇచ్చాడు. దీంతో ఆ మాట తనను అన్నాడని షాక్ లో ఉన్నాడు సుధీర్. ఇక ఇది కామెడీ పరంగా అనగా అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Actor priyadarshi, Hyper Adi, Sridevi drama company, Sudigali sudheer

    తదుపరి వార్తలు