హోమ్ /వార్తలు /సినిమా /

Priyadarshi: హరికథకు ప్రియదర్శి సపోర్ట్.. ఆకట్టుకుంటున్న పిల్లా నీ చేతి గాజులు సాంగ్

Priyadarshi: హరికథకు ప్రియదర్శి సపోర్ట్.. ఆకట్టుకుంటున్న పిల్లా నీ చేతి గాజులు సాంగ్

Harikatha Photo Twitter

Harikatha Photo Twitter

Harikatha Movie: 'హరికథ' అనే అట్రాక్టివ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాకు ప్రియదర్శి సపోర్ట్ లభించింది. ఆయన చేతుల మీదుగా పిల్లా నీ చేతి గాజులు సాంగ్ రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వైవిధ్యభరితమైన స్టోరీతో 'హరికథ' (Harikatha) అనే అట్రాక్టివ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఓ కొత్త సినిమా. ఈ మూవీలో కిరణ్ (Kiran), రంజిత్ (Ranjith), సజ్జన్ (Sajjan), అఖిల రామ్ (Akhila Ram), లావణ్య రెడ్డి (Lavanya Reddy), కీర్తి (Keerthy) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు, కవిత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనుదీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తూనే ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు మేకర్స్. ఈ మేరకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సపోర్ట్ తీసుకుంటున్నారు.

ఇప్పటికే ఈ హరికథ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయడం విశేషం. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని తలసాని శ్రీనివాస్ కోరుకున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా హరికథ సినిమాలోని "పిల్లా నీ చేతి గాజులు" అనే పాటను ప్రముఖ నటుడు ప్రియదర్శి (Priyadarshi) చేతుల మీదుగా విడుదల చేశారు. విడుదల చేసిన కాసేపట్లోనే యూట్యూబ్ లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి చివరి దశ పనులను శరవేగంగా జరుపుతోంది చిత్ర యూనిట్. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల లోపు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.' isDesktop="true" id="1486186" youtubeid="N1F12UmS2IA" category="movies">

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సర్వ హంగులతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ హరికథ సినిమా వినూత్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్న సినిమా అని, ఇది అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు అనుదీప్ రెడ్డి అంటున్నారు. ఎక్కడా రాజీ పడకుండా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దిన సినిమా ఇది అని ఆయన తెలిపారు. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ప్రకటిస్తామని చెప్పారు.

First published:

Tags: Actor priyadarshi, Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు