Sonu Sood: సోనూ సూద్‌కు ప్రకాశ్ రాజ్ సత్కారం.. నువ్వు దేవుడికి స్వామి..

Sonu Sood: ఒకప్పుడు సోనూ సూద్ అంటే విలన్.. కానీ ఇప్పుడు ఈయన హీరో. సినిమాల్లో ఈయన విలన్‌గా చూపించినా కూడా ఆడియన్స్ ఒప్పుకునేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈయన కరోనా సమయంలో హీరో అయిపోయాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 28, 2020, 9:30 PM IST
Sonu Sood: సోనూ సూద్‌కు ప్రకాశ్ రాజ్ సత్కారం.. నువ్వు దేవుడికి స్వామి..
సోనూ సూద్ (Twitter/Sonu Sood)
  • Share this:
ఒకప్పుడు సోనూ సూద్ అంటే విలన్.. కానీ ఇప్పుడు ఈయన హీరో. సినిమాల్లో ఈయన విలన్‌గా చూపించినా కూడా ఆడియన్స్ ఒప్పుకునేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈయన కరోనా సమయంలో హీరో అయిపోయాడు. వందల కోట్లున్న హీరోలు కూడా చేయలేని పని ఈయన చేసి చూపించాడు. వలస కార్మికులకు కొండంత అండగా నిలబడి వాళ్లను ఆదుకున్నాడు.. పెద్దదిక్కులా నిలబడ్డాడు. లాక్ డౌన్ మొదలైన రోజు నుంచి దాదాపు 20 వేల మందిని తమ సొంత ప్రాంతాలకు పంపించడమే కాదు.. కొందరిని ఏకంగా ప్రత్యేక విమానాల్లో కూడా పంపించాడు.
సోనూ సూద్ (Twitter/Sonu Sood)
సోనూ సూద్ (Twitter/Sonu Sood)


కొందరు వలస కార్మికులు అయితే సోనూ ఫోటో పెట్టుకుని దేవుడిలా కొలుస్తున్నారు.. మరికొందరు తమ బిడ్డలకు ఆయన పేరు పెట్టుకున్నారు. ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసి కాదనకుండా అందరికీ సాయం చేసాడు సోనూ సూద్. అన్నా అని పిలిచిన వాళ్లందరినీ ఆదుకున్నాడు ఈయన. కేరళలో చిక్కుకున్న ఒడిస్సా అమ్మాయిలను సొంత గ్రామాలకు చేర్చడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసాడు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించాడు. అంతే కాకుండా కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేసాడు.
సోనూ సూద్ (Twitter/Sonu Sood)
సోనూ సూద్ (Twitter/Sonu Sood)

ఇలా ఒకటా రెండా ఎన్నో మంచి పనులు చేసి అందరికి హీరో అయిపోయాడు సోనూ సూద్. సినిమాల్లో చేసేది విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అయిపోయాడు ఈయన. దేశమంతా సోనూ సూద్‌ను ప్రశంశలతో ముంచేస్తుంది. తాజాగా సోనూ సూద్‌ను నటుడు ప్రకాష్ రాజ్ సన్మానించాడు. చాలా రోజుల తర్వాత ఈయన షూటింగ్‌కు వచ్చాడు. హైదరాబాద్‌లో ఈ షూటింగ్ జరుగుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో సోనూ సూద్ నటిస్తున్నాడు. కందిరీగ సినిమాలో సోనూ అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడు.
సోనూ సూద్ (Twitter/Sonu Sood)
సోనూ సూద్ (Twitter/Sonu Sood)

దాంతో మరోసారి తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లుడు అదుర్స్ షూటింగ్ కోసం సెట్‌కు వచ్చిన సోనూను చప్పట్లతో ఆహ్వానించాడు ప్రకాశ్ రాజ్. అనంతరం శాలువాతో సన్మానించాడు ప్రకాశ్‌ రాజ్. సోనూ చేస్తున్న మంచి పనులకు ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీతో మిగతా నటీనటులు.. సోనూ సూద్‌ రియల్‌ హీరో అంటూ ప్రశంసించారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: September 28, 2020, 9:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading