Manchu Vishnu - Prakash Raj: సినీ ఇండస్ట్రీ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి ఇటీవలే ప్రకాష్ రాజ్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు ఉన్నా
Manchu Vishnu - Prakash Raj: సినీ ఇండస్ట్రీ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి ఇటీవలే ప్రకాష్ రాజ్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు ఉన్నా సరే 'మా' అధ్యక్షుడిగా పోటీ చేయడానికి సిద్ధం అంటున్నాడు. ఇక తాజాగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు పోటీగా మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కూడా పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రెండేళ్లకు ఒకసారి జరిగే మా అధ్యక్ష ఎన్నికలు గత ఏడాది జరగవలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మా ఎన్నికల గురించి చర్చలు జరగగా మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ మూవీ అసోసియేషన్ ప్రతిష్ట మరింత పెంచుకోవడానికి గట్టి పోటీగా ముందుకు వస్తున్నాడు. ఇక మంచు విష్ణు కూడా అదే గట్టిపోటీ తో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం గురించి తెగ వార్తలు వస్తున్నాయి.
కానీ మంచు విష్ణు గురించి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు. తన పోటీ కి సంబంధించిన సన్నిహితులతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక మంచు ఫ్యామిలీకి చిరంజీవి కుటుంబం నుండి మంచి సంబంధం ఉందన్న సంగతి తెలిసిందే. బహుశా మంచు విష్ణు చిరంజీవితో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రకాశ్ రాజ్ కు కూడా నాగబాబు నుండి మద్దతు కూడా లభించింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కు పోటీగా మంచు విష్ణు రావడంతో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి మద్దతుతో మంచు విష్ణు కూడా వచ్చినట్లయితే ఈసారి ఎన్నికలలో భిన్నమైన మార్పులు కలుగుతాయని తెలుస్తుంది. ఇక దీని గురించి మంచి విష్ణు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.